ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. రెండు రోజుల్లో మూడు బంగారు పతకాలు, మూడు కాంస్యాలతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ: థాయ్ లాండ్ లో జరుగుతున్న 25వ ఆసియాఅథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 2023 లో భారత్ క్రీడాకారులు రెండో రోజైన గురువారంనాడు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. రెండు రోజుల్లో భారత్ క్రీడాకారులు మూడు స్వర్ణాలు, మూడు కాంస్యాలను సాధించారు. ఈ నెల 12న ప్రారంభమైన క్రీడలుఈ నెల 16వ తేదీతో ముగియనున్నాయి.
ఈ క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ లో జ్యోతియరాజాజీ బంగారు పతకం సాధించింది. పురుషుల 1500 మీట్ల రేసులో అజయ్ కుమార్ సరోజ్ కూడ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. పురుషుల ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ స్వర్ణం సాధించాడు. వెయ్యి మీటర్ల రేసులో అభిషేక్ పాల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల రేసులో ఐశ్వర్య కైలాష్ మిశ్రా కాంస్యాన్ని సాధించింది. పురుషుల డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్ కాంస్యం దక్కించుకున్నాడు.