మెస్సీ కల నెరవేరే... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టైటిల్ గెలిచిన అర్జెంటీనా...

By Chinthakindhi Ramu  |  First Published Jul 11, 2021, 10:20 AM IST

కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా...

28 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన అర్జెంటీనా...

అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి తొలి అంతర్జాతీయ మెగా టైటిల్...


అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ టైటిల్ కల నెరవేరింది... 28 ఏళ్ల తర్వాత కోపా అమెరికా టోర్నీని గెలిచిన అర్జెంటీనా, అంతర్జాతీయ టైటిల్ లేదనే మెస్సీ లోటును తీర్చేసింది. హోరాహోరీగా జరిగిన కోపా అమెరికా ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించిన అర్జెంటీనా... 15వ సారి ఈ టోర్నీని గెలిచినట్టైంది...

1993లో తొలిసారి కోపా అమెరికా కప్‌ను గెలుచుకున్న అర్జెంటీనా, చివరిగా 28 ఏళ్ల కింద 1993లో టైటిల్ గెలిచింది. సరిగ్గా ఐదేళ్ల కిందట 2016లో క్రిస్టియోనో రొనాల్డో తన మొట్టమొదటి అంతర్జాతీయ టైటిల్ గెలిస్తే, మళ్లీ అదే రోజున మెస్సీ కూడా అంతర్జాతీయ టైటిల్ గెలవడం విశేషం.

Latest Videos

ఫైనల్ మ్యాచ్‌లో ఆట 22వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ ఏజెల్ డీ మారియా ఏకైక గోల్ చేశాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ను గోల్ చేయకుండా నిలువరించిన అర్జెంటీనా, టైటిల్ సాధించింది. టాప్ స్కోరర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన మెస్సీ, ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా కూడా నిలవడం విశేషం.

click me!