గుడ్‌న్యూస్ చెప్పిన క్రికెటర్ హర్భజన్ సింగ్... మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా బస్రా...

Published : Jul 10, 2021, 01:00 PM IST
గుడ్‌న్యూస్ చెప్పిన క్రికెటర్ హర్భజన్ సింగ్... మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా బస్రా...

సారాంశం

మగ బిడ్డకు జన్మనిచ్చిన గీతా బస్రా... తల్లీ బిడ్డా క్షేమం... సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియచేసిన క్రికెటర్ హర్భజన్ సింగ్...

భారత క్రికెటర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య గీతా బస్రా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు హర్భజన్ సింగ్.

హర్భజన్, గీతా జంటకి ఇప్పటికే ఓ ఐదేళ్ల కూతురు ఉంది. 2016లో జన్మించిన ఈ పాపకి హినయా హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు ఈ దంపతులు. ‘దిల్ దియా హై’, ‘ది ట్రైన్’ వంటి కొన్ని చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి గీతాను 2015లో ప్రేమించి పెళ్లా చేసుకున్నాడు హర్భజన్ సింగ్.

టీమిండియాలో చోటు కోల్పోయి ఐదేళ్లు దాటుతున్నా, ఇంకా రిటైర్మెంట్ ప్రకటించని హర్భజన్ సింగ్... ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున ఆడుతున్నాడు. కోలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తూ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు భజ్జీ...

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే