62 బంతుల్లో 162 ...టీ20లలో అఫ్గన్ క్రికెటర్ సంచలనం

By Siva KodatiFirst Published Feb 24, 2019, 4:19 PM IST
Highlights

నివారం డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గన్‌... ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ భీకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది. 

టీ20లలో అఫ్గానిస్తాన్ క్రికెటర్ హజ్రతుల్లా జజాయ్ కొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 62 బంతుల్లో 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శనివారం డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గన్‌... ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ భీకర ఇన్నింగ్స్‌తో భారీ స్కోరు సాధించింది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన జజాయ్ వచ్చిన బంతిని వచ్చినట్లు చితకబాదాడు.. ఈ క్రమంలో 42 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. శతకం తర్వాత మరింత రెచ్చిపోయిన జజాయ్ మరో 20 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు.

అతని ఇన్నింగ్సులో 11 ఫోర్లు, 16 సిక్సులు ఉన్నాయి. ఇతనికి జతగా ఉస్మాన్ ఘని రాణించడంతో అఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు సాధించింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ కూడా అదే స్థాయిలో చెలరేగింది. ఒక దశలో 10 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 109 పరుగులు చేసిన ఐరీస్ జట్టు.. స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంట్రీతో చతికిలబడిపోయింది.

రషీద్ 4 వికెట్లు తీయడంతో ఐర్లాండ్ స్కోరు మందగించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ స్టిర్లింగ్ 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మరోవైపు అఫ్గన్ ధాటికి 2016లో శ్రీలంకపై ఆస్ట్రేలియా నెలకొల్పిన 263 పరుగుల అత్యథిక స్కోరు కనుమరుగైంది. ఈ మ్యాచ్‌లో హజ్రతుల్లా , ఘని తొలి వికెట్‌కు 236 పరుగులు జోడించడం ద్వారా ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 16 సిక్సులు కొట్టి టీ20లలో ఒక మ్యాచ్‌లో అత్యథిక సిక్సర్లు కొట్టిన క్రికెటర్‌గా హజ్రతుల్లా రికార్డుల్లోకి ఎక్కాడు. 

click me!