యూఎస్ ఓపెన్ : గ్రాండ్ స్లామ్ ను దక్కించుకున్న స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్

Published : Sep 12, 2022, 07:23 AM IST
యూఎస్ ఓపెన్ : గ్రాండ్ స్లామ్ ను దక్కించుకున్న స్పెయిన్ యువ సంచలనం అల్కరాజ్

సారాంశం

యూఎస్ ఓపెన్ లో ఓ అద్భుతం తగ్గింది.. యూఎస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ తన ప్రత్యర్థి క్యాస్పర్ రూడ్‌ను ఓడించి తన తొలి గ్రాండ్ స్లామ్‌ను నాలుగు సెట్ల థ్రిల్లర్‌ మ్యాచ్ లో గెలుచుకున్నాడు. 

న్యూయార్క్ : కప్పు సాధిస్తారని ఆటగాళ్లు వెనక్కి తిరిగి యూఎస్ ఓపెన్ లో అనుకూలంగా టైటిల్ బరిలో నిలిచి హోరాహోరీగా తలపడ్డారు ఇద్దరు యువ క్రీడాకారులు. ఇద్దరికీ ఇదే తొలి యూఎస్ ఓపెన్ ఫైనల్.  అయినప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డారు. అయితే చివరికి విజయం స్పెయిన్ యువ సంచలనం..  19 ఏళ్ల కుర్రాడు అల్కరాజ్ నే వరించింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 2-6. 7-6(7-1), 6-3 తేడాతో గెలుపొందాడు. దీంతో పాటు అతని ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. 

స్పెయిన్ కే చెందిన దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ 2005లో అతి పిన్న (19 యేళ్లు) వయసు ఆటగాడిగా తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. తాజాగా అల్కరాజ్ ఆ రికార్డును సమం చేయడంతో పాటు 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో విజయం కోసం ఇద్దరూ తీవ్ర కృషి చేశారు. ఎక్కడా  ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా తలపడ్డారు. ఈ క్రమంలో అల్కరాజ్ 6-4 తేడాతో ఈ సెట్ ను కైవసం చేసుకుని సమంగా నిలిచాడు. 

Asia Cup: ఆసియా కప్ లంకదే.. ఫైనల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్..

ఇక మూడో సెట్ లో విజయం కోసం ఇద్దరు కఠోర శ్రమ చేశారు. మొదట ఆధిక్యంలోకి రూడ్ దూసుకు వెళ్ళగా,  ఆ తర్వాత అల్కరాజ్ ఒత్తిడిని అధిగమించి స్కోర్ ను సమం (6–6) చేయడంతో ఈ సెట్ టై బ్రేకర్ కు మళ్ళింది. ఇందులో 7-1 (7-6)తేడాతో అల్కరాజ్ నెగ్గాడు. కీలకమైన నాలుగు సెట్ లో రూడ్ చేతులెత్తేశాడు. అల్కరాజ్  తన ఆధిక్యాన్ని  నిలుపుకుంటూ 6-3 తేడాతో తొలిసారి యూఎస్ కిరీటంతో పాటు ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ ను తన సొంతం చేసుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

సూర్యకుమార్ ఔట్, అతడికే కెప్టెన్సీ పగ్గాలు.. టీ20 టీమ్ ప్రకటన
IPL 2026: ఈసారి ఐపీఎల్ చాలా స్పెష‌ల్‌.. చ‌రిత్ర‌లోనే అతిపెద్ద సీజ‌న్‌, ఇంకా ఎన్నో మార్పులు