రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

Published : Nov 02, 2018, 09:59 AM ISTUpdated : Nov 02, 2018, 10:16 AM IST
రిషబ్ పంత్ కోసమే.. ధోనీ అలా చేశాడు.. కోహ్లీ

సారాంశం

టీ20 మ్యాచుల్లో తొలిసారి భారత్ వరల్డ్ కప్ తెచ్చిన ఘటన ధోనీది అలాంటి ధోనీకే అవకాశం ఇవ్వరా అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ధీనిపై విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించారు.

టీ20ల్లో టీం ఇండియా మాజీ కెప్టెన్ కి అవకాశం ఇవ్వలేదని ఇప్పటికే ధోనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ20 మ్యాచుల్లో తొలిసారి భారత్ వరల్డ్ కప్ తెచ్చిన ఘటన ధోనీది అలాంటి ధోనీకే అవకాశం ఇవ్వరా అని అభిమానులు మండిపడుతున్నారు. కాగా.. ధీనిపై విరాట్ కోహ్లీ తొలిసారిగా స్పందించారు.

టీ20 ఫార్మాట్ నుంచి అతడికి ఉద్వాసన పలికారనడం సరికాదని స్పష్టం చేశాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తగినంత సమయమివ్వాలనే ఆలోచనతోనే ధోనీ తప్పుకొన్నాడని కోహ్లీ వెల్లడించాడు. వన్డేల్లో అతడు జట్టు అంతర్భాగమని, వచ్చే ప్రపంచక్‌పలో ధోనీ ఆడతాడని తేల్చి చెప్పాడు. 
‘నాకు తెలిసి ధోనీ విషయాన్ని ఇదివరకే సెలెక్టర్లు చెప్పారనుకుంటున్నాను. అందుకే మళ్లీ నేను వివరణ ఇవ్వాలనుకోవడం లేదు. ఆ జట్టు ఎంపికలో కూడా నేను పాల్గొనలేదు. కానీ జట్టులో ఇప్పటికీ ధోనీ అంతర్భాగమే. టీ20ల్లో యువ కీపర్‌ పంత్‌కు మరిన్ని అవకాశాలు వస్తే మంచిదన్నది ధోనీ ఉద్దేశం’ అని కోహ్లీ అన్నాడు. 

కోహ్లీ మాటలను బట్టి.. ధోనీ కావాలనే టీ20 ఫార్మాట్ కి దూరమయ్యాడనే విషయం అర్థమౌతోంది. మరి దీనిపై ధోని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

more news

సెలక్షన్ కమిటీ పై మండిపడుతున్న ధోని ఫ్యాన్స్

PREV
click me!

Recommended Stories

Lionel Messi : హైదరాబాద్ అభిమానులకు మెస్సీ స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ స్పీచ్ విన్నారా?
Lionel Messi : మెస్సీతో సై అంటే సై.. సీఎం రేవంత్ రెడ్డి రచ్చ.. ఎవరు గెలిచారు?