ఫాల్గుణ మాసంలో శివారాధన చేస్తే ఎంత మంచిదో తెలుసా..!

By Mahesh Rajamoni  |  First Published Feb 13, 2023, 3:27 PM IST

ఫాల్గున మాసంలో పండ్ల రసంతో రుద్రాభిషేకం చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శివుడికి చందనం సమర్పిస్తే సకల సౌభాగ్యాలు కలగుతాయట. 


ఫాల్గున మాసం ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమై మార్చి 7 న అంటే హోలీ పండుగతో ముగుస్తుంది. పురాణాల  ప్రకారం.. ఈ మాసం ధార్మిక కార్యక్రమాలకు ప్రత్యేకమైందిగా భావిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజించే నియమం గురించి కూడా ఎన్నో గ్రంధాలు ప్రస్తావించాయి. 

ఈ ఫాల్గున మాసంలో శివుడికి అభిషేకం చేస్తే ఆ వ్యక్తి జీవిత కాలం పెరుగుతుందని నమ్ముతారు. రోగాలు కూడా దూరమై.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తారట. నెయ్యి, పండ్ల  రసాలతో రుద్రాభిషేకం చేయడం వల్ల మీకు అన్ని రకాల సమస్యలు దూరమైపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జ్యోతిష్యుల ప్రకారం.. శివుడికి చందనం  సమర్పిస్తే  సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ మాసంలో అవసరమైన దానాలు చేయడం, విరాళాలు ఇవ్వడం సుఖ శాంతులను తెచ్చిపెడుతుంది. 

Latest Videos

undefined

గ్రంధాల ప్రకారం.. ఫాల్గున మాసాన్ని అన్ని రోగాల నుంచి విముక్తి కలిగించే నెలగా భావిస్తారు. ఈ మాసంలో పరమేశ్వరుడికి తెల్ల చందనం సమర్పిస్తే ఆరోగ్యం అన్ని విధాలా బాగుంటుందట. అలాగే ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

విరాళాలు ఇవ్వడం కూడా ఫాల్గుణ మాసంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ మాసంలో తమ శక్తి సామర్థ్యాలను బట్టి నిరుపేదలకు ధాన ధర్మాలు చేయాలని  చెప్తారు. ఫాల్గుణ మాసంలో స్వచ్ఛమైన నెయ్యి, నూనె, ఆవనూనె, సీజనల్ పండ్లను దానం చేస్తే మీ ఇళ్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

పలు మత గ్రంధాల ప్రకారం.. ఈ సమయంలో ప్రజలు ఎన్నో శుభకార్యాలు చేస్తారు. పురాణాల ప్రకారం పరమేశ్వరుడి ధ్యానానికి కామదేవుడు ఆటంకం కలిగిస్తాడు. దీందో భోళాశంకరుడు కామదేవుడిని భస్మం చేస్తాడు. అందుకే ఫాల్గుణ శుక్ల అష్టమి నాడు కామదేవుడి దహనం చేస్తారు.
 

click me!