శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:
అండ పిండ బ్రహ్మాండ సమ్మిళితమైన ఈ విరాట్ విశ్వమునకు 'సద్యోజాతము'గా పిలవబడే తూర్పు ముఖము 'మనువిశ్వకర్మ' మహాశివుడు 'వామదేవము'గా పిలువబడే దక్షిణముఖము 'మయవిశ్వబ్రహ్మ' మహావిష్ణువు 'అఘోరము'గా పిలవబడే పశ్చిమ ముఖము 'త్వష్ట విశ్వబ్రహ్మ' చతుర్ముఖ బ్రహ్మ 'తత్పురుషము'గా పిలువబడే ఉత్తరముఖము 'శిల్పబ్రహ్మ' ఇంద్రుడు 'ఈశాన్యము'గా పిలువబడే ఊర్ధ్వముఖము 'విశ్వజ్ఞబ్రహ్మ' సూర్యుడు పంచముఖములుగా ఉద్భవించిన వీరిని 'పంచబ్రహ్మలు' అంటారు. ఇలా 'పంచాననము'గా పిలువబడే ఈ మహా విశ్వమును సృష్టించిన 'శ్రీ విరాట్ విశ్వకర్మ' ఈ ప్రపంచాన్ని ఉద్దరించడానికి ధరించిన అవతారమే 'కాలజ్ఞానము' కృతికర్త శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు.
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంథాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను వారు చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే. కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వారి 328 వ ఆరాధనోత్సవం ప్లవనామ సంవత్సరంలో పంచాంగ ప్రకారం ఆంగ్లమాన తేదీ 21 మే 2021 శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు క్రీస్తు శకం 1608 స్వస్తీ శ్రీ చాంద్రమానేన కీలక నామ సంవత్సర కార్తీక మాస శుద్ధ ద్వాదశినాడు జన్మించారు. వీరి తండ్రి శ్రీ పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి శ్రీ పోతులూరి ప్రకృతాంబ, తనును పెంచిన తండ్రి పేరు శ్రీ వీర భోజయాచార్యులు, పెంచిన తల్లి పేరు శ్రీ వీరపాపమాంబ. తనుకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. స్వామివారు వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు.
పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా నచ్చచేబుతూ జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరుతాడు.
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు 1608 జన్మించి 1693 లో జీవసమాధిని పొందారు. కలియుగం 4694 కు సరిసమానమైన క్రీ.శ 1693 వ సంవత్సరం వైశాఖ మాస శుద్ధ దశమి తిధి శుక్రవారం రోజున పగలు రెండున్నర గంటలకు శ్రీ వీరబ్రహ్మేద్ర స్వాముల వారు జీవ సమాధి యందు ప్రవేశించారు. ఈ రోజునే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనోత్సవంగా తమ భక్తులు జరుపుకుంటారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 17వ శతాబ్దానికి చెందిన పరమ పురుషులు. కాలజ్ఞానాన్ని బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. వీరబ్రహ్మేంద్రస్వామి వారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన అనేక విషయాలకు, సంఘటనలకు మనం సాక్షిభూతులం అవుతున్నాం. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.
భక్తిశ్రద్ధలతో ఎవరైతే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి మూలమంత్రమైన "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:" అనే మూలమంత్రాన్ని ప్రతిరోజూ నిష్టగా '108' సార్లు జపిస్తే.. వారికి ఇహలోకంలోని సమస్త ఇతిభాదలు, గ్రహదోష నివారణలు జరిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. అంత్యమందు సద్గతి ప్రాప్తి కలుగుతుంది.