వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం గుండా సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కాబట్టి ఈ ప్రదేశం పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మహిళలు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేయాలి. గుమ్మాలు పసుపురాసి బియ్యం పిండి ముగ్గులతో అలంకరించుకోవాలి,
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. గత సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో మొదలైన మహమ్మారి కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ ప్లవనామ సంవత్సరంలో కుడా కరోనా కారణంగా ఇంట్లో సానుకూల శక్తి నశించి ప్రతికూలత పెరుగుతోంది. ఇందుకోసం ఇంటి ప్రధాన గేట్ వద్ద ప్రతి రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం ద్వారా ఈ ప్రతికూలతను తొలగించవచ్చును. మనం నివసించే ఇంట్లో సానుకూలతను వాతవరణం కల్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దాదాపు ప్రతి ఇంట్లోను సానుకూల శక్తి పూర్తిగా నాశనమవుతోంది. ఇంట్లోకి వచ్చే షాకింగ్ వార్తలు, అశుభ విషయాల వల్ల ప్రతికూలత ఇంటిని చుట్టుముడుతుంది. సానుకూల శక్తి నశించి ప్రతికూల శక్తిని ప్రేరేపించేలా చేస్తున్నాయి. ఇందుకోసం ఇంటి ప్రధాన గేట్ వద్ద ప్రతి రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం ద్వారా ఈ ప్రతికూలతను తొలగించవచ్చు. ఈ నేపథ్యంలో ఇంట్లో సానుకూలతను ప్రేరేపించే నివారణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం గుండా సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కాబట్టి ఈ ప్రదేశం పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత మహిళలు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేయాలి. గుమ్మాలు పసుపురాసి బియ్యం పిండి ముగ్గులతో అలంకరించుకోవాలి, ఇంటి ప్రధాన గుమ్మం పైన భోజపత్ర రక్షా యంత్రంతో కూడిన గోమాత సమేత శ్రీ ఐశ్వర్యకాళీ అమ్మవారి పటానికి రోజు ఎర్రని పూలతో పూజించి దూపం వేస్తూ ఉండాలి, ఇలా చేయడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా అన్ని రకాల ప్రతికూలతలను తొలగిస్తుంది. ఆర్థిక సమస్యలు, వాస్తు సమస్యలు, నరదృష్టి, దుష్ట శక్తుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మీ ఇంటి ప్రధాన గుమ్మం తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దం వస్తూ ఉంటే అది రాకుండా తగిన ఆయిల్ వేసి శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, తలుపును వెంటనే సరిచేయండి. తలుపును శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మర్చిపోయి కూడా దాన్ని విచ్ఛిన్న చేయకూడదు. మెయిన్ డోర్ పగలినట్లయితే లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు కలుగదు. కాబట్టి ఈ వాస్తు లోపాలు ఉంటే తప్పనిసరిగా సరిచేయాలి.
స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు, రెండు హారతి కర్పూరం బిళ్ళలు చూర్ణం చేసి వేసుకుని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మందిరంలో ధూపం వేసి అనంతరం ప్రతిరోజూ ఇంటి ప్రధాన తలుపుపై పసుపు నీటిని చల్లాలి. తలుపుకు ఇరువైపులా కొద్దిగా శుభ్రమైన నీటిలో పసుపు తులసి ఆకులు, దళాలు, హారతి కర్పూరం బిళ్ళలు వేసి చల్లాలి. గుమ్మాల దగ్గర పాదరక్షలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి, ఇలా చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. సానుకూల శక్తి ప్రేరేపించడానికి దోహదపడుతుంది.
సాయంత్రం సమయంలో పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అనంతరం ప్రధాన ద్వారం వద్ద కూడా వెలిగించాలి. వాస్తవానికి ప్రధాన తలుపుకు ఈ విధంగా వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అమ్మ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఫలితంగా ఇంట్లో సానుకూలత శక్తి పెరగడమే కాకుండా ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. దీపారాధన చేసేటప్పుడు ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి.
ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కల్గిన గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చేయండి. బిక్షగాళ్ళు వస్తే వారికి ఎదో ఒకటి ఇచ్చి పంపండి కానీ ఉరికే ఏమి ఇవ్వకుండా పంపవద్దు. వారానికి మూడు సార్లైనా సాయం సంద్యా సమయంలో ఇంట్లో, వ్యాపార సంస్థలలో దూపం తప్పక వేయండి. ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది.