హృదయం గర్భగుడి

By telugu news team  |  First Published Mar 29, 2020, 8:00 AM IST

శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

undefined


మన సనాతన ధర్మంలో చెప్పిన పలు అంశాలలో మనకు అందని సైన్స్ ఉందంటే ఆశ్చర్యమే. కానీ వీటికి సంబంధించిన పలు అంశాలు క్రమేపి రుజువవుతున్నాయి. హిందు దేవాలయాలలో ఖగోళ , ఆర్కిటెక్చర్ ,సైన్స్ , జ్యోతిషం ,వాస్తు  ఇలా పలు అంశాలు మిళితమై ఉంటాయి. భగవద్గీతలో  శ్రీ కృష్ణ భగవానుడు .... 'ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం' అని చెప్పారు. ఈ  శరీరం ఒక ఆలయం. మానవ శరీరం దేవుని ఆత్మకోసం ఆలయం. ఆలయ నిర్మాణం వివిధ భాగాలుగా మానవ శరీరంలోని వివిధ భాగాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ ఆలయం దైవిక ఉనికిని కలిగి ఉన్న భౌతిక శరీరం  "స్థూల శరీరం"    

శరీరం:- ‘శీర్యతే ఇతి శరీరః’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనం కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు.

దేహం:- దేహమని ఎందుకన్నారు ? 'దహ్యతే ఇతి దేహః' అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా ? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా ! అవి దహింపబడవు గదా ! మరి వాటిని దేహాలు అని అనరా ? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలనే అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం.

దేవాలయం:-  దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకు ? "దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః" - అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం? ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. 

కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి - ఈ గుడికి అదే తేడా ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ ' అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది ? ఏ దేవుని పూజ గొప్పది ? ఆలోచించు కోవాలి. అప్పుడే "దేహం దేవాలయం" అవుతుంది, "హృదయం గర్భగుడి" అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

click me!