మత్స్య జయంతి: ఇళ్లలో వాస్తు దోష నివారణకు ఇలా...

By telugu news teamFirst Published Mar 27, 2020, 3:42 PM IST
Highlights

శ్రీ మహా విష్ణువు యొక్క శక్తివంతమైన మత్స్యయంతం ఇంటి 'నలు' దిక్కులలో స్థాపితం అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజించి స్థాపన చేయించుకున్నఇంటిలోని సమస్త వాస్తు దోషాలు నివారణలు జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైనది ఈ యంత్రం ఇంట్లో స్థాపితం చేయించుకోవడం వలన సుఖశాంతులతో జీవిస్తారు. ఈ మత్స్యావతారం గురించి సంక్షితంగా తెలుసుకుందాం. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఈ రోజు మత్స్య జయంతి. శ్రీ మహావిష్ణువు దశావతారములలో మొదటి అవతారం మత్స్యావతారము. ఈ మత్స్య జయంతి చైత్ర బహుళ పంచమి రోజు వస్తుంది. సమస్త భూమండలాన్ని, వేదాలను రక్షించినది విష్ణువు. మానవులు నివసించే ఇళ్ళల్లో వాస్తు దోషాలు, శల్యదోశాలు, శూలలు, పోట్లు మొదలగు సమస్త దోషాల నివారణకు కొరకు ఉపయోగిస్తారు. 'వాస్తు దోష' నివారణ కొరకు ఇంటి గోడలలో పంచలోహా మత్స్యయంత్రాలు పెట్టుకోవడం అనేది ఆనాది కాలం నుండి మనం చూస్తూనే ఉన్నాం. 

శ్రీ మహా విష్ణువు యొక్క శక్తివంతమైన మత్స్యయంతం ఇంటి 'నలు' దిక్కులలో స్థాపితం అనుభవజ్ఞులైన పండితులచే శాస్త్రోక్తంగా విధి విధానాలతో పూజించి స్థాపన చేయించుకున్నఇంటిలోని సమస్త వాస్తు దోషాలు నివారణలు జరుగుతాయి. ఎంతో మహిమాన్వితమైనది ఈ యంత్రం ఇంట్లో స్థాపితం చేయించుకోవడం వలన సుఖశాంతులతో జీవిస్తారు. ఈ మత్స్యావతారం గురించి సంక్షితంగా తెలుసుకుందాం. 

పరీక్షిత్తు మహారాజు మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతతో ..... విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గూర్చి వివరించమని శుకబ్రహ్మను కోరగా నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మునులకు ఈవిధంగా వివరిస్తున్నాడు. భగవానుడు గోవులను, మనుష్యులను  దేవతలను, సాధువులను, వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను ధరిస్తూఉంటాడు. భగవానుడు ఏ రూపమును ధరించినా ఆ రూపము యొక్క గుణ దోషములు తనకు అంటవు.

ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారములు ప్రసిద్ధమైనది. మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తంచేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచనగా చెబుతారు.

బ్రహ్మకు ఒక పగలు అంటే - వెయ్యి మహాయుగాలు .... గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు. ఆసమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశనం అవుతుంది అని అంటారు. దీనినే నైమిత్తిక ప్రళయంగ చెబుతారు. ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వంగా సృష్టిని ఆరంభిస్తాడు. దీనిని 'కల్పం' అని అంటారు.

వరాహకల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు , విష్ణు భక్తుడు. ఒకరోజు అతను కృతమాలా నదికి వెల్లి స్నానం చేసి, సూర్యునికి అర్ఘ్యం ఇస్తూండగా దోసిటలో చేపపిల్ల పడినది. రాజు దానిని నీటిలోనికి జారవిడిచాడు. మళ్ళీ నీటిని దోసిలలోకి తీసుకున్నప్పుడు చేతిలోనికి చేప వచ్చి ఈ విధంగా పలికింది "రాజా ! నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి, దయచేసి నన్ను రక్షించు" అని ప్రార్థించినది. వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేసాడు. మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రపట్టనంత పెద్దది అయ్యింది. అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు. ఆ మరుసటిరోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు. అ రాజు ... ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు. 

ఆ మత్స్యం (చేప) శతయోజన ప్రమాణానికి విస్తరించింది. అంతట ఆ మత్స్యం "తాను శ్రీమన్నారాయణుడుని అని, ఏడు రోజులలో ప్రళయం రానున్నదని, సర్వజీవరాశులు నశించిపోతాయి అని, ఈ లోకమంతా మహాసాగరమవుతుంది అని, నీవంటి సత్యవ్రతుడు నశింపరాదని" పలికింది. ఒకపెద్ద నౌకను నిర్మించి, అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు, బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని, సప్తఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది.

మీనరూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహాసర్ప రూపమైన తాడుతో నావను కట్టి, ప్రళయాంతం వరకు రక్షిస్తాడు. సాంఖ్యాయోగ క్రియాసహితమైన పురాణసంహితను రాజుకు ఉపదేశిస్తాడు. సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధదేవునిగా జన్మించి, 'వైవస్వత మనువు' గ ప్రశిద్ధికెక్కాడు.

బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా వేదాలు అపహరణకు గురి అయ్యాయి. బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటినుండి వేదాలు జారి క్రింద పడగా, "సొమకాసురుడు" అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి, సముద్రగర్భంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా, అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి,, అతని కడుపుని చీల్చి ...... వేదాలను - దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని, బ్రహ్మవద్దకు వచ్చాడు. శంఖాన్ని తానూ తీసుకొని, శిధిలమైన వేదభాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు. ఇది రెండో మత్స్యావతారం.

వేదాలను అపహరించటం అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగుణ అహంకారశక్తిని తనలో లయం చేసుకోవటం అని సంకేతం. రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృస్టికార్య ప్రతిబంధరూపకమైన తమస్సు అంతరిస్తుంది. బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరల గ్రహించటం అని తత్వార్థం. పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి.

పరబ్రహ్మ చైతన్యాత్మ సర్వ వ్యాపకమని, విశ్వంలో కనిపించే తేజమే పర్మాత్మ స్ఫురణమని గ్రహించిన మముక్షువులు నివృత్తి రూపమోక్షపదం పొందగలరని మత్స్యావతార గాథ సూచిస్తోంది.

మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని వేదనారాయణస్వామి ఆలయం అని పిలుస్తారు.


 

click me!