ఉగాది నాడు తలంటు స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలున్నాయో..!

By Mahesh Rajamoni  |  First Published Mar 18, 2023, 4:04 PM IST

Ugadi 2023: ఒంటికి, నెత్తికి నూనె రాసి స్నానం చేయడాన్నే తలంటు స్నానం లేదా నూనె స్నానం అంటారు. అయితే ఉగాది నాడు నూనె స్నానం చేస్తే ఎన్నో  ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? 
 


Ugadi 2023: ఉగాది పండుగ ఈ ఏడాది మార్చి 22 న వచ్చింది. ఈ పండుగను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగను ఈ రాష్ట్రాలకు కొత్త సంవత్సరం కూడా. అయితే ఈ ఉగాదినే గుడి పడ్వాగా మహారాష్ట్రలో జరుపుకుంటారు. 

ఈ పండుగకు పురాన్ పోలీ లేదా పూర్ణం భక్షాలను తయారుచేస్తారు. ఉగాది సందర్భంగా కొత్తసంవత్సరం పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. పంచాంగ శ్రవణం భవిష్యత్తు మనకు ఎలా ఉండబోతోందో చెబుతుంది.  ఈ శ్రవణం విన్నవారికి అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. 

Latest Videos

undefined

జ్యోతిష్యల ప్రకారం.. ఉగాది రోజున తెల్లవారు జామునే లేసి తలంటు స్నానం చేయాలి. తలంటు స్నానాన్నే నూనె స్నానం అని కూడా అంటారు. దీపావళికి కూడా నూనె స్నానం చేస్తారు. అసలు తలంటు స్నానం ఎందుకు చేయాలి? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

స్నానం చేయడం వల్ల ఒంటికి అంటుకున్న క్రిమి కీటకాలు, దుమ్ము దూళీ అంతా పోయి శరీరం శుభ్రపడుతుంది. అయితే ఉగాది నాడు నూనె స్నానం చేస్తే అధ్యాత్మికత  పెరుగుతుందని నిమ్ముతారు. అంతేకాదు ఇది మనస్సును దైవచింతనలో ఉంచుతుంది. 

ఒంటికి నూనె రాయడం వల్ల ప్రతికూల ఆలోచనలు రావని నమ్మకం. అంతేకాదు ఇది సానుకూల భావనలు రావడానికి సహాయపడుతుంది. దుష్టశక్తుల ప్రభావం మనపై పడదని జ్యోతిష్యులు చెబుతారు. 

శరీరానికి నూనె రాయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మం పొర తేమగా, కాంతివంతంగా మారిపోతుంది. 

తలంటు స్నానం జీవశక్తిని పెంచుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మనల్ని సంతోషంగా కూడా ఉండేలా చేస్తుంది. అందుకే ఉగాది నాడు తెల్లవారు జామునే లేసి తలంటు స్నానం తప్పకుండా చేయండి.  
 

click me!