TTD News: శ్రీవారి ప్రత్యేక దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి.. పూర్తి వివరాలు మీ కోసం..

By Mahesh Rajamoni  |  First Published Mar 21, 2022, 10:58 AM IST

TTD News:  కరోనా పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టడంతో.. టీటీడీ దర్శన టికెట్ల సంఖ్యను బారీగా పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో 300 రూపాయలకు స్పెషల్ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం  tirupatibalaji.ap.gov.in, tirumala.org లింక్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 


కరోనా కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లను సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పడుతుండటంతో టీటీడీ దర్శక టికెట్లను క్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే తాజాగా టీటీడీ అధికారిక వైట్ సైట్ లో 300 రూపాయలకే స్పెషల్ దర్శన టికెట్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఈ రోజు (సోమవారం) నుంచి బుధవారం వరకు 30 వేల టికెట్లు అందులో ఉంటే.. గురువారం నుంచి సన్ డే వరకు రోజు చొప్పున 25 , 000 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఆన్ లైన్ లో  tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో  శ్రీవారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. 

Latest Videos

undefined

ఎలా బుక్ చేసుకోవాలి..   tirupatibalaji.ap.gov.in అనే వెబ్ సైట్ ద్వారా రూ.300 ల ప్రత్యేక దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం  సైట్ ప్లై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ను పూర్తిచేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ  తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక కోవిడ్ డిక్లరేషన్ ఫారం పూర్తి చేయమని వస్తుంది. దాన్ని కొనసాగించడానికి కన్ఫర్మేషన్ ను అడుగుతుంది. దానికి అగ్రీ అనే బటన్ పై క్లిక్ చేయండి. 

ఆ తర్వాత దర్శనం కోసం మీరు ఒక తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత సమయాన్ని కూడా అడుగుతుంది. అవి సెలక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఆకుపచ్చ కలర్ స్లాట్ ను చూపిస్తుంది. ఇవి టికెట్ల అందుబాటును తెలియజేస్తుంది. అందులో ఎల్లో కలర్ స్లాట్ వస్తే వస్తే సీట్లు తొంతరగా నిండిపోతున్నట్టు అర్థం. అదే నీలం రంగు టికెట్ వస్తే.. టికెట్లు ఇంకా విడుదల చేయలేదని తెలియజేస్తుంది. ఎరుపు రంగు అయితే దర్శన టికెట్ల కోటా అయిపోయిందని అర్థం. 

ఈ వివరాలను పొందుపరచాలి.. తర్వాత పేజీలో పేరు, జెండర్, ఏజ్, ఫోటో ఐడీ ప్రూఫ్, ఐడీ కార్డ్ నంబర్ మొదలైన వివరాలను పొందుపరిచి ‘కొనసాగించు’ అనే బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 

చెల్లింపు చేయండి: డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు, యూపీఐ లేదా నెట్ బ్యాకింగ్ వంటి వివిధ పద్దతుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని అవసరమైన మొత్తాన్ని చెల్పించాలి. ఇక చివరగా మీకు టీటీడీ ఆన్లైన్ టికెట్ బుక్ చేయబతుంది.  
 

click me!