కామ దహనం

Published : Mar 16, 2022, 03:08 PM IST
కామ దహనం

సారాంశం

పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా కామ దహనం.. పార్వతి దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడానికి సహయంగా శివుని తపస్సును భంగ పరచమని కామ దేవుడిని అడుగుతుంది.

భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి, ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం యొక్క పరమార్ధం. మన భారతీయ హిందూ సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో పండగలు అనేవి ఆయా పర్వదినానికి సంబంధించిన ఒక ప్రత్యేక తిధి, నక్షత్ర రోజులలో తెలుగు నెలల ఆధారంగా వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇది పునారావృతం అవుతుంది. ఒక ప్రత్యేకమైన పండుగను అదే ప్రత్యేకమైన రోజునాడు ఎందుకు జరుపు కోవాలి అనేది జ్యోతిష ఆధారంగా తెలుస్తుంది. ప్రస్తుత హోలీ పండగ అనేది ఎప్పుడు, ఏలా జరుపుకోవాలి అనే విషయంలో ధర్మసింధు,నిర్ణయ సింధు మొదలగు ప్రామాణిక గ్రంధాల ఆధారంగా వివరణ పరిశీలించి చూడగా కామదహనం అనేది పాల్గుణ మాస, పౌర్ణిమ రోజు చేయాలని నిర్ణయం చేసారు, అందుకే కాముని పున్నమి అనే పేరు వచ్చింది. ఈ పండగను యావత్ భారత దేశ ప్రజలు అన్ని ప్రాంతలవారు ఆనందంగా జరుపుకుంటారు. 

పురాణ గ్రంధాల ఆధారంగా చూడగా కామ దహనం.. పార్వతి దేవి పరమ శివుడిని వివాహం చేసుకోవడానికి సహయంగా శివుని తపస్సును భంగ పరచమని కామ దేవుడిని అడుగుతుంది. అప్పుడు కామదేవుడు ఆ తపస్సులో ఉన్నశివుడి ఏకాగ్రతను భంగం పరచడానికి అతనిపై పూలబాణం వదులుతాడు. తన తపస్సుకు భంగం కల్గించింది ఎవరా? అని ఆ పరమశివుడు తన  త్రీనేత్రం దివ్యదృష్టితో చూడగా అదికామదేవుడని గ్రహించి తన ముక్కంటిని తెరిచి కామదేవుడి శరీరాన్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతిదేవి పరమ శివుడికి వద్దకెళ్లి వేడుకోగా తిరిగి కామ దేవుడిని బతికిస్తాడు. శివుడు కామాన్ని దహించిన సంఘటనకు ప్రతీకగా కామదహనం చేయడమనే ఆచారం నేటికి కొనసాగుతు వస్తుంది.  సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపోందించుకోవాలనేదే ఈ పండగలోని అంతరార్ధం.


రంగులు చల్లుకోవడంలో ఆంతర్యం...హిరణ్య కశపుడి చెల్లెలు అయినా హోలిక రాక్షసి చనిపోవడం వల్ల ఆమె బాధలనుంచి విముక్తి అయినందుకు సంతోషంగా రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తు హోలిక మహోత్సవాన్ని ఆనాడు రఘు మహారాజు రాజ్యంలోని ప్రజలు జరుపుకున్నారు. ఆహోలిక మహో త్సవం నాటినుంచి నేటివరకు కొనసాగిస్తు ప్రజలు ఒకరిపై మరోకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య హోలీ సంబురాలను జరుపుకుంటున్నారు. 

కాముడుని పరమేశ్వరుడు భస్మీపటలం చేయడంలో అంతర్లీనంగా మానవజాతికి ఒక సందేశం కనబడుతుంది. కాముడు ప్రతీ మనిషిలోను అదృష్య రూపంలో అంతట వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉన్న అరిష్డ్వర్గాలైన రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయ మొదలగు గుణాలను ప్రజ్వరిల్లకుండా అను నిత్యం అదుపు చేసుకుని మనస్సుని అధీనంలో పెట్టుకోవాలని సందేశం కనబడుతుంది. మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీ చేస్తే మనిషి భ్రష్టు పట్టి పోతాడు.మనిషిలోని రజో,తామస గుణాలను పారదోలి, సాత్విక గుణంతో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది.

"మనిషిని మహానీయుడిగా మార్చే మహత్తరశక్తి మనస్సుకు ఉంటుంది, ఆ మనస్సుని అధీనంలో పెట్టుకోవడం కేవలం మనిషికే ఉంటుంది". మనిషి యొక్క మనస్సును, శరీరాన్ని ఆధీనంలో పెట్టుకో గలిగిన వారు మనుషులలో మహానీయులౌతారు.


డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

PREV
click me!

Recommended Stories

Chanakya Niti: పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నారా.? ఇలాంటి మ‌హిళ‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది
చాణక్య నీతి ప్రకారం ఇలాంటి జీవిత భాగస్వామి ఉంటే జీవితాంతం కష్టాలే!