మనిషి జీవితం.. మాయాజాల జీవితం

By Ramya news team  |  First Published Feb 23, 2022, 4:40 PM IST

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణిక మైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు.


ధనమున్నదని... అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని, ఈ రోజు మానవుడు గర్విస్తాడు.

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. ఈ క్షణిక మైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు.

Latest Videos

undefined

"ధన జన యౌవన గర్వం"

కొందరికి ధన గర్వం, కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...
వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు...
అంతా డబ్బే , డబ్బున్నవారు మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు...

"కొందరికి జనగర్వం"

తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు... అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు, సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు...
తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు. 
కాని ‘అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది, తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో...

"ఇక కొందరికి యౌవన గర్వం"

యవ్వనం శాశ్వతం అనుకుంటారు, శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం.. ఆ గర్వంలో అతడు/ఆమె మంచి.. చెడూ.. గమనించరు. 
కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, అహంభావంతో ఉంటారు... ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు...

"హరతి నిమేషాత్కాలః సర్వం"

ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు. 
ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి. 
నాకేం.. కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది, అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది...

"ఇప్పుడు ఏమైంది ఆ గర్వం"
నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు. వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది.

కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు, అంటే అనుభవించు తప్పులేదు, కాని వాటితో సంగభావం పెట్టుకోకు.


డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 

click me!