సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటని చాలా మందికి సందేహం రాకమానదు. సంక్రాంతి నిలబెట్టిన తరవాత శుభకార్యాలు చేయకూడదా అని మరో సందేహం కల్గుతుంది.
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది.
"సంక్రాంతి" లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో "సంక్రాంతి"ని ఇలా విర్వచించారు -
" తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః "
undefined
మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ( రధయాత్రలో ) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని "సంక్రాంతి పండుగ"గా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తికాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.
సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటని చాలా మందికి సందేహం రాకమానదు. సంక్రాంతి నిలబెట్టిన తరవాత శుభకార్యాలు చేయకూడదా అని మరో సందేహం కల్గుతుంది. సంక్రాంతి పండగ సౌరమానానికి సంబంధించినది. సర్వసాధారణంగా భారతీయ హిందువులకు అన్నీ పండగలు చాంద్రామానాన్ని అనుసరించి పండగలు నిర్ణయింపబడుతాయి. వీటికి తిధిని ప్రధానంగా చేసుకుని పండగలు నిర్ణయించండం జరుగుతుంది.
సంక్రాంతి పండగకు మాత్రం సూర్యుని గమనం ఆధారంగా పండగను నిర్ణయిస్తారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం అంటారు. ఆ రోజు నుండి ఉత్తరాయాణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. భారతీయులకు ఈ కాలం అత్యంత పుణ్యకాలం, పర్వదినంగా భావిస్తారు.
సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన నాటి నుండి మకరరాశిలోకి ప్రవేశించే కాలం వరకు ధనుర్మాసంగా పరిగణిస్తారు. దీనినే తెలంగాణ ప్రాంతంలో మార్గళి అని, గద్దె నిలబెట్టడం అని అంటారు. సంక్రాంతి నిలబెట్టడం అన్నా ఇదే. ధనుర్మాసంతో పాటు సంక్రాంతి పండుగను పీడలను తొలగించే పుణ్యకాలంగా భావిస్తారు.
శూన్య మాసమైన పుష్యంతో కూడుకున్న ధనుర్మాసంలో శుభ ముహూర్తాలు ఉండవు. వివాహాది శుభకార్యాలు చేయరు. ధనుర్మాసంలో మార్గశిరం ఉన్నట్లయితే నిస్సందేహంగా శుభకార్యాలు జరుపుకోవచ్చును.
ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకపోవడం వెనుక ఆంతర్యం దాగిఉంది. ధనుర్మాసం అంటే డిసెంబర్ నెలలో వచ్చేది ఈ కాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పూర్వం కాలంలో ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి జీవితాలు గడుస్తూ ఉండేది కాబట్టి యాసంగిలో పొలం పనులు కూడా జోరుమీద ఉంటాయి. ఈ సమయంలో శుభకార్యాల వలన వ్యవసాయం కుంటుపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ధనుర్మాసంలో మార్గశిర మాసం ఉన్నప్పటికీ పూర్వకాలంలో శుభకార్యాలు చేసేవారు కాదు.
ఈ 2021 సంవత్సరంలో మార్గశిరమాసం డిసెంబర్ 5 తేదీ నుండి ప్రారంభమై 2 జనవరి 2022 వరకు మార్గశిర మాసం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు జరుపుకోవచ్చును. 3 జనవరి 2022 నుండి పుష్యమాసం ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి నుండి ఒక మాసం వరకు శుభకార్యాలు ఉండవు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151