Sri Rama Navami 2022: తన తండ్రికిచ్చిన మాటకోసం శ్రీరాముడు సతీసమేతంగా, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి.. అడవులకు వెళ్లి.. పద్నాలుగేండ్ల వనవాసం తర్వాత అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయ్యింది శ్రీరామనవమి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇదేరోజు నాడు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని చెబుతున్నాయి.
Sri Rama Navami 2022: ప్రతి ఏటా శ్రీరామ నవమిని చైత్ర శుద్ధ నవమి నాడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే అదేరోజునాడు శ్రీరాముడు జన్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఇదేరోజునాడు శ్రీరాముడు అరణ్యవాసం వీడి అయోధ్యకు చేరుకుని పట్టాభిశుక్తుడు అయిన రోజని కూడా పురాణాల్లో ఉంది. అదేరోజున సీతారాముల కళ్యాణం జరిగిందని పండితులు చెబుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజునాడు ప్రజలంతా ఈ పండుగనుు ఘనంగా జరుపుకుంటారు. మరి ఇంత పవిత్రమైన రోజున ఆ శ్రీరామ చంద్రుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం పదండి.
శ్రీరామ నవమి నాడు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలంటు పోసుకోవాలి. ఆ తర్వాత పసుపు పచ్చ దుస్తులను వేసుకుని న ఇంటిని శుభ్రపరచుకోవాలని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత పూజా గదిని అలంకరించుకోవాలి. తర్వాత గుమ్మాలకు వేప, మామిడి కొమ్మలను పెట్టాలి. అనంతరం గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లను పెట్టి ఇంటి ముందు ముగ్గులను వేయాలి.
undefined
సీతారాముడు, లక్ష్మణుడు, భరతుడు శతృఘ్నులు ఉన్న ఫోటోలను పూలతో అలంకరించి నిష్టగా పూజించి నైవేధ్యాన్ని పెట్టాలి. నైవేధ్యంగా వడపప్పు, పానకం సమర్పించాలని పండితులు చెబుతున్నారు.
ఆ తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం లేదా శ్రీరామ సహస్రం, శ్రీరామ అష్టోత్తరం వంటి స్త్రోత్రాలను పఠించాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత శ్రీరాముడి పట్టాభిషేకం కథను చదవాలి. ఇలా చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మీ దగ్గర్లో ఉన్న దేవాలయాల్లో శ్రీసీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తే మీకంతా శుభమే జరుగుతుందట. మీరు అనుకున్న పనులన్నింటీ ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మీకు సకల సంపదలు కలుగుతాయట.
ఇకపోతే శ్రీరామ నవమి నాడు ఉదయం 12 గంటల నుంచి శ్రీరాముడికి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పూజలో రెండు దీపారాధనలు, కంచు దీపంలో ఐదు వత్తులను వేసి వెళిగించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు శ్రీరామరక్షా స్తోత్రాన్ని జపించాలి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం పుస్తకాలను ఐదుమంది ముత్తయిదువులకు తాంబూలంలో పెట్టి ఇస్తే అంతా శుభమే జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.