Ganesh Chaturthi-2022: దేవతలకే దేవుడు అయినటువంటి ఈ గణనాథుడి అనుగ్రహం కలగాలంటే వినాయక చవితి రోజు స్వామివారికి ఏ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలో ఇక్కడ తెలుసుకుందాం..
మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా ఎన్నో రకాల పండుగలను జరుపుకుంటాము. ఇలా ప్రతి పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకోవాలని పండుగ రోజు పెద్ద ఎత్తున పిండి వంటలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31వ తేదీ రానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ప్రాంతాలలోనూ గణేష్ విగ్రహాలకు ఏర్పాట్లు చేస్తూ సందడి చేస్తున్నారు.
ఇకపోతే కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు లేదా ఐదు రోజులు ఏడు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఎంతో ఘనంగా నిమర్జనం కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఇకపోతే వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. మనం ఏ కార్యం చేసిన ముందుగా వినాయకుడిని పూజించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇలా దేవతలకే దేవుడు అయినటువంటి ఈ గణనాథుడి అనుగ్రహం కలగాలంటే వినాయక చవితి రోజు స్వామివారికి ఏ విధమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలో ఇక్కడ తెలుసుకుందాం...
వినాయక చవితి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున పిండివంటలను తయారు చేస్తారు. ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, బొబ్బట్లు, మోదకాలు, లడ్డూలు, పాయసం, గారెలు వంటి మొదలైన వంటకాలను తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా మూడు రోజులపాటు లేదా ఐదు రోజులు ఏడు రోజులపాటు వినాయకుడికి పెద్ద ఎత్తున వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఏడాది వినాయక చవితిని ఆగస్టు 31వ తేదీ ఘనంగా జరుపుకొనున్నారు.