Mahashivratri 2024: శివపార్వతుల పెళ్లి జరిగిన ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ రోజుకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Mahashivratri 2024: ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పవిత్రమైన శివభక్తులు మహాదేవున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాశివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి నాడు వస్తుంది. శివరాత్రి రాకతో శివాలయాలన్నీ ఈ రోజు భక్తులతో పోటెత్తుతారు. చాలా మంది ఈ రోజు శివయ్య అనుగ్రహం పొందేందుకు నిష్టగా ఉపవాసం ఉంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున శివభక్తులు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
మహాశివరాత్రి నాడు ఏం చేయాలి?
undefined
మహాశివరాత్రి నాడు నిష్టగా ఉపవాసం ఉండాలి. సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం శివయ్యను పూజించాలి.
ఈ రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటిని సమర్పించాలి.
మహాశివరాత్రి పర్వదినాన మీరు ఉపవాస కథ వినండి. దీనివల్ల మీకు శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది.
శివుడికి బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ రోజు శివయ్యకు బిల్వ పత్రాన్ని సమర్పించండి.
ఈ పవిత్రమైన రోజున నిరుపేదలకు దానం చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయి. అందుకే ఈ రోజు స్వీట్లు, దుప్పట్లు, ఆహారం వంటివి మీకు చేతనైన దానం చేయండి.
ఈ రోజు శివకీర్తణలు చేయండి. దీంతో దేవుడు సంతోషించి మీ కష్టాలన్నీ పోగొడుతాడు.
మహాశివరాత్రి రోజు ఏం చేయకూడదు?
ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు ఎట్టిపరిస్థితిలో ఆల్కహాల్ తాగకూడదు. మాంసం తినకూడదు.
అలాగే ఈ రోజు ఒకరిని చూసి అసూయ పడకూడదు. అలాగే అబద్ధం చెప్పకూడదు.
పక్షులు, జంతువులకు హాని చేయకండి. ఇలా చేస్తే మహాదేవుడికి కోపం వస్తుంది.
ఈ రోజు గొడవలు పెట్టుకోకండి.
ఈ మహాశివరాత్రి పర్వదినాన రాగి కలశంలోని నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. అయితే ఇతర ఏ పాత్రలతోనూ నీళ్లను సమర్పించకూడదు.
ఈ రోజు నిద్రకు దూరంగా ఉండాలి.