మహాశివరాత్రి 2024: మీ రాశి ప్రకారం.. శివపూజ ఇలా చేయండి.. మీ కష్టాలన్నీ తీరిపోతాయి

By Shivaleela RajamoniFirst Published Mar 8, 2024, 9:56 AM IST
Highlights

Mahashivratri 2024: మహాశివరాత్రి నాడు శివపార్వతుల వివాహం జరిగిందని చెప్తారు. ఈ పవిత్రమైన రోజున శివపార్వతులను నిష్టగా పూజిస్తే వారి అనుగ్రహం పొందుతారు. అలాగే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. 
 

Mahashivratri 2024: ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని ఫాల్గుణ మాసంలోని  కృష్ణ పక్షం చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పండుగ శివ-శక్తి ఆరాధనకు అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం.. ఈ రోజునే పరమేశ్వరుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నారు. ఇక శివరాత్రి నాడు భోళాశంకరుడిని, పార్వతీదేవిని నిష్టగా పూజిస్తే మన కష్టాలు, బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటామని నమ్ముతారు. అందుకే ఈ రోజున రాశిచక్రం ప్రకారం.. ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మేషం

మహాశివరాత్రి సందర్భంగా మేష రాశివారు శివలింగానికి బిల్వపాత్రాలను సమర్పించి పూజించాలి. అలాగే మహాదేవునికి ఎర్రని పువ్వులను కూడా సమర్పించి నెయ్యి దీపం వెలిగించండి. మీరు ఈ పద్దతిలో శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం పొందుతారు.

వృషభ రాశి

వృషభ రాశి వాళ్లు శివలింగానికి పాలు, నీటిని కలిపి అభిషేకం చేయాలి. అలాగే ఈ దేవుడికి గంధం పెట్టి, తెల్లని పువ్వులను సమర్పించండి. చివరగా దేవుడికి ఆయురారోగ్యాలను ప్రసాధించమని వేడుకోండి. ఇలా పూజిస్తే మీ ప్రతి కోరికా నెరవేరుతుంది. అలాగే శివుని అనుగ్రహం కూడా పొందుతారు. 

మిథున రాశి

మహాశివరాత్రి నాడు మిథున రాశి వారు శివుడికి పెరుగును కలిపిన నీటిని సమర్పించండి. అలాగే పూజా సమయంలో శివ పురాణం చదవండి. దీంతో శివుడు సంతోషించి ఆయన అనుగ్రహం మీపై ఉండేలా చూస్తాడు. అలాగే మీ బాధలన్నీ పోగొడుతాడు. 

కర్కాటకరాశి

ఈ రోజు కర్కాటక రాశి వాళ్లు శివలింగానికి గంధాన్ని సమర్పించాలి. అలాగే బియ్యా, పాలను కూడా శివలింగానికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం మీపై ఉంటుంది. 

సింహ రాశి

ఈ మహాశివరాత్రి పర్వదినాన సింహ రాశి వాళ్లు భోళాశంకరుడి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. అలాగే ధూపదీప నైవేధ్యాలను, బంతిపూలను సమర్పించి దేవుడి ఆశీస్సులు పొందండి. 

కన్యా రాశి

ఈ రోజు కన్య రాశి వాళ్లు శివలింగానికి నల్ల నువ్వులు, నీళ్లను కలిపి అభిషేకం చేయాలి. అలాగే రకరకాల తాజా పండ్లను, స్వీట్లను కూడా శివలింగానికి సమర్పించండి.

తులా రాశి

మహాశివరాత్రి నాడు తులా రాశి వాళ్లు శివలింగానికి తెల్ల చందనాన్ని నీటిలో కలిపి అభిషేకం చేయాలి. అలాగే శివలింగానికి అందమైన ఆలయాన్ని నిర్మించి.. సువాసనలు వెదజల్లే పువ్వులు, సుగంధ ద్రవ్యాలను సమర్పించండి. ఇలా చేస్తే మీరు శివానుగ్రహం పొందుతారు. 

వృశ్చిక రాశి

శివుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజున వృశ్చిక రాశి వాళ్లు నీటిని, బిల్వ పత్రాలను సమర్పించాలి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూలతలు తొలగిపోతాయి. 

ధనుస్సు రాశి

మహాశివరాత్రి నాడు ధనుస్సు రాశి వాళ్లు శివలింగానికి గులాల్ ను సమర్పించండి. అలాగే ఇంట్లో శివుడిని పూజించిన తర్వాత శివాలయానికి వెళ్లి పూజ చేయండి. 

మకర రాశి

ఈ మహాశివరాత్రి నాడు మకర రాశి వాళ్లు శివలింగానికి భాంగ్, దతురాను సమర్పించండి. అలాగే "ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించండి. శివలింగానికి బెల్లం, నువ్వులను సమర్పిస్తే ఈ దేవుడి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. 

కుంభ రాశి

ఈ పవిత్రమైన రోజున కుంభ రాశి వాళ్లు శివలింగానికి నీలి పువ్వులను సమర్పించండి. అలాగే పూజా సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. దీంతో మీరు మహాదేవుడి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు. 

మీన రాశి

మహాశివరాత్రి నాడు మీన రాశి వాళ్లు శివలింగానికి కుంకుమపువ్వు. చెరుకు రసంతో అభిషేకం చేయాలి. అలాగే ఓం నమః శివాయా అనే మంత్రాన్ని కూడా జపించాలి. అలాగే మీరు దేవుడికి తేనె, పాలను కూడా సమర్పించొచ్చు. 

click me!