మనం నిత్యం దైవానికి చేసే దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి.. ఏ నూనె వాడాలి, ఆవివాడితే ఎలాంటి ఫలితాలనిస్తాయనే విషయంలో చాలా సందేహాలు కలగడం సహజం. శుభాలనిచ్చే దీపారాధన ఏమిటో గమనిద్దాం.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోஉస్తుతే
undefined
మనం నిత్యం దైవానికి చేసే దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి.. ఏ నూనె వాడాలి, ఆవివాడితే ఎలాంటి ఫలితాలనిస్తాయనే విషయంలో చాలా సందేహాలు కలగడం సహజం. శుభాలనిచ్చే దీపారాధన ఏమిటో గమనిద్దాం.
* ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వశుభములు, శాంతి కలుగును.
1 ) నెయ్యి :- నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును.
2 ) నువ్వుల నూనె :- నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును.
3 ) ఆముదం :- ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును.
4 ) వేరుశెనగ ( పల్లి ) నూనె :- వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును.
5 ) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును.
6 ) వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును.
1 ) ఒకవత్తి :- సామాన్య శుభం
2 ) రెండువత్తులు :- కుటుంబ సౌఖ్యం
3 ) మూడువత్తులు :- పుత్ర సుఖం
4 ) ఐదువత్తులు :- ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి.. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము..
* దీపాలయొక్కదిక్కుల ఫలితములు :-
1 ) తూర్పు :- కష్టములు తొలగును , గ్రహ దోషములు పోవును.
2 )పశ్చిమ :- అప్పుల బాధలు , గ్రహ దోషములు, తొలగును.
3 )దక్షిణం :- ఈ దిక్కున దీపము వెలిగించరాదు, కుటుంబమునకు కష్టము కలుగును.
4 )ఉత్తరం :- ధనాభివృద్ధి, కుటుంబములో శుభ కార్యములు జరుగును.
* దీపవత్తులయొక్క_ఫలితములు :-
1) పత్తి:- పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును.
2) అరటినార :- ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును.
3) జిల్లేడునార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.
4) తామరనార :- పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవంతులు అగుదురు.
5) నూతన పసుపురంగు వస్త్రము :- అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు.
6) నూతన ఎరుపు రంగు వస్త్రము :- వివాహాలు జరుగును, సంతానము కల్గును.
7) నూతనతెల్లవస్త్రము :- పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును.
* సాయంసంధ్య సమయములలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం, సౌభాగ్యం కల్గును. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసినచో మరిన్ని సత్పలితాలను ఇస్తాయి.
*వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితలలో నోటితో ఊద కూడదు.
* దీపాన్ని భూమిపై పెట్టకూడదు. దీపం కుంది క్రింద వస్త్రం కానీ బియ్యం కానీ తమలపాకు, అరటిఆకు ఏదైనా ప్లేట్ మొదలైనవి తప్పక వేయాలి.
* దీపం వెలిగించిన తర్వాత తప్పక కుంకుమ బొట్టు పెట్టాలి.