Janmashtami: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ కృష్ణ దేవాలయాలు ఇవే..!

By telugu news teamFirst Published Aug 19, 2022, 12:05 PM IST
Highlights

చిన్నతనంలో చిన్న కృష్ణుడు ఇక్కడే పెరిగాడని పురణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో కృష్ణుడు చేతిలో మురళిని ధరించి దర్శనమిస్తారు. ఆలయం కూడా చాలా అందంగా ఉంటుంది.
 

నేడే శ్రీ కృష్ణ జన్మాష్టమి. శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి కృష్ణుడి పుట్టినరోజు. శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారంలో భూమిపై అవతరించిన శుభదినం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు గోకులాష్టమి పండుగను అత్యంత వైభవంగా , కోలాహలంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా.. ప్రముఖ కృష్ణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఓసారి చూద్దాం...

1.ద్వారాకాదిశాలయం, ద్వారక( భారత్)
భారత్ లోని ప్రముఖ కృష్ణాలయాలలో ద్వారక మొదటి స్థానంలో ఉంటుంది. దీనినే జగత్ మందిరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడి ఆలయం చాలా ఫేమస్. పురుణాల ప్రకారం.. కృష్ణుడు ద్వారక నగరంలో నివసించాడని ప్రతీతి. అందుకే.. కృష్ణ భక్తులు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటూ ఉంటారు.

2.బంకే బిహారీ ఆలయం, బృందావనం(భారత్)
భారత్ లోని మరో ప్రముఖ కృష్ణాలయం బృందావనం, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. చిన్నతనంలో చిన్న కృష్ణుడు ఇక్కడే పెరిగాడని పురణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో కృష్ణుడు చేతిలో మురళిని ధరించి దర్శనమిస్తారు. ఆలయం కూడా చాలా అందంగా ఉంటుంది.

3.ఇస్కాన్ టెంపుల్( భారత్)

మరో ప్రముఖ ఆలయం ఇస్కాన్ టెంపుల్. దీనినే కృష్ణ బలరామ మందిరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో కృష్ణుడికి సంబంధించిన చాలా విగ్రహాలు ఉంటాయి. జన్మాష్టమిని ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు.

4.ఇస్కాన్ టెంపుల్, సిడ్నీ( ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ నగరంలో అందమైన కృష్ణాలయం ఉంది. ఇస్కాన్ టెంపుల్ గా పిలుస్తారు. శ్రీ కృష్ణుడికి సంబంధించిన అన్ని పండగలను ఈ ఆలయంలో చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తారు.

5.ఇస్కాన్ టెంపుల్( న్యూయార్క్ సిటీ)

న్యూయార్క్ నగరంలోనూ ఓ శ్రీకృష్ణుని ఆలయం ఉంది. అక్కడ నివసించే హిందువులంతా.. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. దీనిని ఇస్కాన్ టెంపుల్ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం.. కృష్ణామి రోజున ఇక్కడ చాలా ఘనంగా ఈ వేడుకను సెలబ్రేట్ చేస్తారు.

6.ఇస్కాన్ టెంపుల్( లండన్)

దక్షిణ లండన్ లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. దీనినే భక్తి యోగా అని కూడా పిలుస్తారు. ఇక్కడ కూడా కృష్ణామి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

7.శ్రీకృష్ణ జన్మాభూమి టెంపుల్, మథుర( భారత్)

భారత్ లోని మరో కృష్ణాలయం మధురలో ఉంది. దీనినే శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం అని పిలుస్తారు. ఇక్కడే కృష్ణుడు జన్మించాడని నమ్మకం.

click me!