sri rama navami 2022: శ్రీరామ నవమి నాడు శుభ గడియల్లో శ్రీరామచంద్రమూర్తిని నిష్టగా పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సంతోషం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
sri rama navami 2022: ప్రతి ఏడాది శ్రీరామ నవమి చైత్ర శుక్ల నవమి నాడు జరుపుకుంటాం. అయితే ఈ చైత్ర శుక్ల నవమి నాడే ఆ శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు అదేరోజు నాడు ఆ సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఇంతటి పవిత్రమైన రోజు నాడు భక్తులు అంగరంగ వైభవంగా శ్రీరామ నవమిని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ శ్రీరామ నవమి నాడు కొన్ని పద్దతులను పాటించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయంట. అవేంటంటే..
undefined
శ్రీరామ నవమి నాడు శుభ గడియల్లో శ్రీరాముడిని నిస్టగా పూజించాలి. పూజా సమయంలో శ్రీరాముడి స్తోత్రాలను జపిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఇలా చదివితే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
శ్రీరాముడి పేరు చాలా పవర్ ఫుల్ అంటుంటారు. అలాంటి నామాన్ని ఆరోజున జపిస్తే జీవితంలో మనం పడుతున్న కష్టాలు, దుఖాలు అన్నీ పోయి సంతోషంగా ఉంటారట.
మీరు కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆ రోజున శ్రీరాముడికి పూజ చేస్తే రామ రక్షా స్తోత్రాన్ని చదవండి. అంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడే మీకు అండగా ఉంటూ మిమ్మల్ని కష్టాల నుంచి బయటకు పడేస్తాడు.
శ్రీరామ నవమి నాడు రామ చరిత నామాలు లేదా రామాయణం వంటివి చదివితే మీకు అంతా మంచే శుభమే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మీరు ఆర్థికంగా ఎదుగుతారు. రామ నవమి నాడు రాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడిని పూజిస్తే కూడా మంచి జరుగుతుందట. హనుమాన్ చాలీసాను చదివితే మీ కోరికలన్నీ నెరవేరుతాయట.
పురాణాలు చదవండి.. మీకు పురాణాలను చదవాలని లేకపోయినా.. శ్రీరామ నవమి రోజున వేదాలను, పురాణాలను చదివాలని పండితులు చెబుతున్నారు. ఆరోజున శ్రీరాముడిని గొప్పతం తెలుసుకుని మనస్ఫూర్తిగా పూజిస్తూ ప్రార్థిస్తే.. మీరు అన్నివిధాల ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుంటారని పండితులు చెబుతున్నారు.