ఈ సృష్టిలో ప్రతీదీ మనకు ఆదర్శమే

By telugu news teamFirst Published Apr 5, 2021, 2:04 PM IST
Highlights

ఇలాంటి ఆశయాలను మనం మాత్రమే కాదు మన లాగే అందరూ సాధించాలని భావిస్తే అది మహోన్నత ఆశయం అవుతుంది. ప్రతి మనిషికి ఆదర్శం అవుతుంది. దీనికి చెయ్యాల్సిందల్లా మనలోని ప్లస్ పాయింట్స్‌ ఎదుటి వారిపై ప్రభావం చూపేలా నడుచుకోవడమే... దానికి కొన్నిసూత్రాలను పాటిస్తే సరిపోతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151 

మానవుని జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదురుకావటం సహజం.. అందులో కొన్ని సార్లు జయాపజయాలు ఉంటాయి. గెలుపు, విజయాలకు పొంగిపోకుండా.. అపజయాలకు లొంగిపోకుండా... తరచూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం.

ఇలాంటి ఆశయాలను మనం మాత్రమే కాదు మన లాగే అందరూ సాధించాలని భావిస్తే అది మహోన్నత ఆశయం అవుతుంది. ప్రతి మనిషికి ఆదర్శం అవుతుంది. దీనికి చెయ్యాల్సిందల్లా మనలోని ప్లస్ పాయింట్స్‌ ఎదుటి వారిపై ప్రభావం చూపేలా నడుచుకోవడమే... దానికి కొన్నిసూత్రాలను పాటిస్తే సరిపోతుంది.

*  ఎదుటి వారిలో మీ పట్ల స్వచ్ఛతను కనబర్చాలి...
*  నవ్వుతూ పలుకరించాలి..
*  ఎదుటి వారు కనపడినప్పుడు వారి పేరుతో ఆప్యాయంగా పలకరించడం, స్పష్టంగా, అర్ధమయ్యే రీతిలో సుళువైన భాషలో స్పష్టంగా మాట్లాడటం..
*  ఎదుటి వారికి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం.. మీరు చక్కగా వినడం..
*  ఇతరులకు నచ్చే రీతిలో మాట్లాడేలా అలవర్చుకోవడం.
*  ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చేలా వారితో నడుచుకుంటూ... ఈ క్రిందివాటిని ఆదర్శంగా ఎప్పడు భావిస్తుండాలి..

పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా.. దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే "సాలె పురుగు" మనకు ఆదర్శం.

ఎన్నిసార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే "అలలు" మనకు ఆదర్శం.

మొలకెత్తడం కోసం భూమిని సైతం  చీల్చుకొని వచ్చే  "మొక్క" మనకు ఆదర్శం.

ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే  "బాణం" మనకు ఆదర్శం.

ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే "మేఘాలు" మనకు ఆదర్శం.

అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే "గాలిపటం" మనకు ఆదర్శం.

తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే "పువ్వు" మనకు ఆదర్శం.

ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని  నీడనిచ్చే "చెట్టు" మనకు ఆదర్శం.

ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే "సూది" మనకు ఆదర్శం.

తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే "సూర్యుడు" మనకు ఆదర్శం.

తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే "చినుకు" మనకు ఆదర్శం.

చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే "చంద్రుడు" మనకు ఆదర్శం.

ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే  "శునకం" మనకు ఆదర్శం.

జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే  "సీతాకోకచిలుక" మనకు ఆదర్శం.

ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే "హంస" మనకు ఆదర్శం.

నిరంతరం జీవకోటి హితం కోసం పరితపించే ప్రతి  "హృదయం" మనకు ఆదర్శం.
 

click me!