కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఫిబ్రవరి 8న రథ సప్తమి రోజు వాహన సేవలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు ప్రకటించారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో.. రథ సప్తమి వేడులకు సర్వ సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన.. ఈ రథ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో... కొన్ని ఆంక్షలతో.. ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు.
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఇలా ఏకాంతంగా రథ సప్తమి వేడుకలు నిర్వహించడం టిటిడీ చరిత్రలో ఇదే తొలిసారని తెలుస్తోంది. . కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఫిబ్రవరి 8న రథ సప్తమి రోజు వాహన సేవలను శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు ప్రకటించారు.
undefined
గత ఏడాది ఆలయం బయటే వాహన సేవలు ఊరేగింపు నిర్వహించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగా స్వామివారికి వాహన సేవలను నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన శ్రీవారు సప్తవాహనాల్లో మాడ వీధుల్లో ఊరేగనున్నారు. రథ సప్తమి వేడుకలలో భాగంగా స్వామివారి 6 గం.ల నుంచి 8.00 గం.ల వరకు సూర్యప్రభ వాహనంపై ఊరేగనున్నారు.
అనంతరం ఉదయం 9.00 గం.ల నుంచి 10 .00 గం.ల వరకూ చిన్నశేష వాహన వేడుకలను నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గం.ల నుంచి 12 .00 గం.ల వరకూ గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1.00 గం.ల నుంచి 2 .00 గం.ల వరకూ హనుమంత వాహన సేవ, నిర్వహించనున్నారు. సాయంత్రం 4.00 గం.ల నుంచి 5 .00 గం.ల వరకూ కల్పవృక్ష వాహన సేవ, 6.00 గం.ల నుంచి 7 .00 గం.ల వరకూ సర్వభూపాల వాహన సేవ, అనంతరం రాత్రి 8.00 గం.ల నుంచి 9 .00 గం.ల వరకూ చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నామని టిటిడీ అధికారులు తెలిపారు. రాత్రి జరిగే చంద్రప్రభ వాహనం ఉరేగింపుతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. ఇక మధ్యాహ్నం 2.00 గం.ల నుంచి 3.00 గం.ల వరకు చక్ర స్నానం నిర్వహించనున్నారు.