Ekadashi 2024: ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ మీరు ఆ పనులను గనుక చేశారంటే మీకు పూజా ఫలం కూడా దక్కదు.
Devshayani Ekadashi dos and Don't: దేవశయని ఏకాదశి ఇతర ఏకాదశిల కంటే చాలా ముఖ్యమైంది. దేవశయని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రావస్థలోకి వెళ్తాడు. ఈ రోజు శ్రీమహావిష్ణువుకు నిష్ట పూజలు చేస్తారు. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలి. అలాగే కొన్ని పనులు అస్సలు చేయకూడదు. దేవశయని ఏకాదశి నాడు చేయకూడని 6 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని దేవశయని ఏకాదశి నుంచి చతుర్మాసం మొదలవుతుంది. ఈ రోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. సంవత్సరంలో వచ్చే నాలుగు ఏకాదశిలలో దేవశయనీ ఏకాదశి ఒకటి. కానీ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవశయని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల మనిషి మోక్షాన్ని పొందుతాడని మన పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. పండితుల ప్రకారం.. ఏకాదశి నాడు తమలపాకుని తీసుకోకూడదు. తమలపాకులు తీసుకోవడం వల్ల మనిషి మనసులో రజోగుణం పెరుగుతుందట. కాబట్టి దేవశయని ఏకాదశి నాడు పాన్ తినకూడదు.
undefined
అలాగే ఈ ఏకాదశి వ్రతం నాడు ఎవ్వరిపై కోపం చూపించకూడదు. అలాగే హింసకు, దొంగతనానికి పాల్పడకూడదు. దీనికి సంబంధించి కబుర్లు చెప్పుకోకూడదు. ఏకాదశి నాడు ఇలా చేస్తే జన్మజన్మలకు ఆ పాపం మిమ్మలి వెంటాడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే సమాజంలో గౌరవం కోల్పోయి.. చాలా అవమానాలు ఎదర్కొంటారని పండితులు పేర్కొంటున్నారు.
దేవశయని ఏకాదశి నాడు ఆడవాళ్లు తమ జుట్టును కట్ చేయకూడదు. గోళ్లను కూడా కత్తిరించకూడదు. అలా చేయడం అశుభంగా భావిస్తారు. పూజలో నల్లని వస్త్రాలు ధరించకూడదు. దేవశయని ఏకాదశి నాడు పూజ చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే పూజ సమయంలో స్త్రీలు జుట్టు విప్పి ఉంచకూడదు.
దేవశయని ఏకాదశి నాడు ఇంట్లో తామసిక ఆహారాన్ని వండకూడదు. మీరు పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదు. అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులెవరూ మాంసాహారం, మద్యం సేవించకూడదు. దేవశయని ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి ఆకులను ముట్టుకోకండి. అలాగే ఈ రోజు తులసి ఆకులను తెంపకూడదు. తినకూడదు. మీరు దీన్ని ప్రసాదంలో ఉపయోగించాలనుకుంటే మీరు ఇప్పటికే తుంచి పెట్టుకున్న వాటిని ఉపయోగించుకోవాలి.
ఈ రోజు దానాలు చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. దేవశయని ఏకాదశి వ్రతం పూర్తైన తర్వాత అవసరమైన వారికి తీపి పదార్థాలు, ఆహారం, పండ్లు, బట్టలు మొదలైన వాటిని దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. పాలు, పెరుగు దానం చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చే బాధలు, కష్టాల నుంచి బయటపడతాడు. అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందనీ, డబ్బు సమస్యలు తొలగిపోతాయని మన పురాణాలు పేర్కొంటున్నాయి.