Devshayani Ekadashi 2024: ఏకాదశి నాడు హిందూవులు ఉపవాసం ఉండటంతో పాటుగా ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తారు. దీనివల్ల గత జన్మ పాపాలు తొలగిపోతాయనీ, శ్రీమహావిష్ణువు అనుగ్రహం మనపై ఉంటుందని నమ్మకం.
Devshayani Ekadashi 2024: దేవశయని ఏకాదశి ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వస్తుంది. ఈసారి దేవశయని ఏకాదశిని జూలై 17 (బుధవారం) జరుపుకుంటున్నాం. హిందుపురాణాల ప్రకారం.. త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు.. దేవశయని ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సమయంలో రుద్రుడు సృష్టిని నిర్వహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో చేసే పూజకు మంచి ఫలం దక్కుతుందని నమ్ముతారు. దేవశయని ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక పూజలు ఆచరించడం వల్ల మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజు శ్రీమహా విష్ణువును పూజించడం వల్ల ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.
ఆషాఢ మాసంలోని దేవశయని ఏకాదశి రోజున పూజ చేసేవారు 'ఓం నమో నారాయణాయా' లేదా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి. తులసి, పూసలతో కూడిన మాలతో ఈ మంత్రాలను 108 సార్లు జపించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.
undefined
దేవశయని ఏకాదశి నాడు సాయంత్రం శ్రీమహా విష్ణువుకు తులసి ఆకుల హారాన్ని సమర్పించి, మరుసటి రోజు ఉదయం ఇంటి ప్రధాన తలుపునకు అదే మాల వేయంతో వల్ల మంచి ఫలం దక్కుతుంది. దేవశయని ఏకాదశి రోజున ఒక రూపాయి నాణేన్ని విష్ణువు చిత్రం దగ్గర ఉంచి, పూజ చేసిన తర్వాత, నాణేన్ని ఎర్రటి గుడ్డలో కట్టి మన ఇంట్లో డబ్బును, నగలు ఉన్న చోట లేదా మన బిర్వాలో ఉంచాలి.
దేవశయనీ ఏకాదశి రోజున శ్రీహరిని దక్షిణ శంఖంతో అభిషేకం చేయాలనీ, ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఆనందం, శాంతి కోసం, దేవశయని ఏకాదశి రోజున, విష్ణువుకు ఖీర్ నైవేద్యంగా ఉంచి, అందులో తులసిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల శ్రీమహా విష్ణువు అనుగ్రహంతో పాటు ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి.