నరక చతుర్దశి రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు.. సమస్యలన్నీ మాయం?

By Navya Reddy  |  First Published Oct 21, 2022, 7:07 AM IST

సాధారణంగా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మనం ఆ పండుగలను సాంప్రదాయబద్ధంగా కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలను అందుకోవచ్చు.


సాధారణంగా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మనం ఆ పండుగలను సాంప్రదాయబద్ధంగా కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఇక మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆచార వ్యవహారాలను ఎలాగ విశ్వసిస్తారో  వాస్తు శాస్త్రాన్ని కూడా అదే విధంగా నమ్ముతారు.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో ఉపయోగించే కొన్ని వస్తువులను సరైన క్రమంలో ఉపయోగించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి.మరి వాస్తు శాస్త్రం ప్రకారం పటికను ఈ విధంగా ఉపయోగించడం వల్ల అన్ని మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం పటిక ఎంతో ముఖ్యమైన వస్తువుగా భావిస్తారు. ఇలా పటికను మన ఇంట్లో సరైన క్రమంలో ఉపయోగించడం వల్ల మన ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా వెల్లువెరుస్తాయి. ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట రోజులలో పటికతో ఇలా చేయటం వల్ల దోషాలు మొత్తం తొలగిపోతాయి. ముఖ్యంగా నరక చతుర్దశి, కాళీ చౌదస్ రోజున పట్టికతో ఈ నియమాలు పాటించడం వల్ల శుభం కలుగుతుంది.

Latest Videos

undefined

నరక చతుర్ద ముందు రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి.నరక చతుర్దశి రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేసి ఒక ఎర్రని గుడ్డలో కాస్త పట్టిక వేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి వేలాడ కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఇల్లు మొత్తం అనుకూల వాతావరణంలో నిండి ఉంటుంది. ఇలా మన ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు సిరిసంపదలు కూడా వెల్లువేరుస్తాయి.

ఆర్థిక సమస్యలతో బాధపడేవారు గుమ్మానికి ఎరుపు రంగు వస్త్రంలో పటికను కట్టి వేలాడదీయాలి. మన ఇంట్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కనుక ఉంటే నల్లని వస్త్రంలో పటికను వేసి వేలాడదీయాలి. ఇలా చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇక మన పర్సులో డబ్బు నిలవకపోతే కొన్ని పట్టిక ముక్కలను మన పర్సులో వేసుకోవడం వల్ల డబ్బు నిల్వ ఉంటుంది.

ఇక మనం అనుకున్న పనులు జరగకపోతే ప్రతిరోజు ఉదయం మనం స్నానం చేసే నీటిలో కాస్త పటిక వేసుకోవటం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అదేవిధంగా మనం చేసే పనులలో కూడా విజయవంతం అవుతాము. ఇలా పటిక ఎన్నో వాస్తు దోషాలను తొలగించి అన్ని శుభ ఫలితాలను కలిగిస్తుంది.

click me!