ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన, ఆలయంలో పాటించాల్సిన అనేకమైన విధులు, నిషేధాలు భృగు మహర్షి వివరంగా తెలియజేసారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
మనకున్న కష్టాలను దైవానికి విన్నవించుకోవాలని, మనస్సు ప్రశాంతంగా చేసుకోవాలని మనము భగవంతుడిని ఆశ్రయిస్తూ ఉంటాము. మనము భగవంతుడిని కోరుకోగానే ఆ బాధలు తీరాలంటే అందుకు తగిన అర్హత భగవంతుడి దగ్గర మనం పొందాలి. అసలు ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి.
ప్రధానంగా ఆలయానికి వచ్చే భక్తుల ప్రవర్తన, ఆలయంలో పాటించాల్సిన అనేకమైన విధులు, నిషేధాలు భృగు మహర్షి వివరంగా తెలియజేసారు. ఆ నియమాలను విధిగా ఆచరిస్తే భగవంతుని పరిపూర్ణకృపకు పాత్రులవుతాము అవి ఏమిటో తెలుసుకుందాం.
1. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి. నిధానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి.
2. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.
3. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు.
4. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు.
5. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు. శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు. శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు, బయట చేయాలి.
6. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి.
7. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు.
8. గంజి ( స్టార్చ్ ) వేసిన వస్త్రాలు ధరించి దేవుని దర్శించ కూడదు.
9. రిక్త హస్తాలతో దేవాలయం దర్శించ కూడదు.
10. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి.
11. గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి. ఇంటి నుండి తయారు చేసుకుని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి.
12. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు ధరించకూడదు.
13. మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి. టిక్లిలు పెట్టరాదు, ముత్తైదువలు కాళ్ళకు పారాణి ధరించాలి, తలలో ఏదేని పువ్వులను ధరించాలి.
14. మహిళలు జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు.
15. మలిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలనే వేసుకోవాలి.
16. గుడిలో మొదట ధ్వజ స్థంబం యొక్క శిఖరం దర్శించి మూడు ప్రదక్షిణలు చేయాలి. గుళ్ళో గోమాత ఉంటే తప్పక ఏదేని గ్రాసం ఇచ్చి ప్రదక్షిణలు చేయాలి.
17. గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను తాకకూడదు.
18. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు.