విపక్షాలు లేకుండా టిడిపికి మీడియా సహకారమా ?

Published : Oct 20, 2016, 04:11 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
విపక్షాలు లేకుండా టిడిపికి మీడియా సహకారమా ?

సారాంశం

విపక్షాలు లేకుండా టిడిపికి మీడియా సహకరిస్తోందా లోకేష్ బహిరంగ ప్రకటన

రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా అధికార తెలుగుదేశం పార్టీకి మీడియా సహకరిస్తోందా? అలాగని స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేషే స్వయంగా చెప్పటం ఇపడు సర్వత్రా చర్చనీయాంశమైంది. గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో లోకేష్ మట్లాడుతూ, మీడియా సహకారంతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నట్లు చెప్పటం విశేషం.

  మరి లోకేష్ ఆ మాటను బహిరంగంగా ఎందుకు చెప్పారో ఎవరికీ అర్దం కావటం లేద. ఎందుకంటే, ఏ రాజకీయ పార్టీ కూడా తమకు ఫలానా మీడియా సహకారం ఉందని బహిరంగంగా చెప్పుకోదు. అవసరమైనపుడు తమకు సహకరించాలంటూ మీడియా మొత్తాన్ని పార్టీలు అడగటం తప్పేమీ కాదు కూడా.

తెలుగుదేశం పార్టీ ఎప్పైడైతే చంద్రబాబునాయడు చేతుల్లోకి వచ్చిందో అప్పటి నుండో మీడియాలోని బలమైన వర్గం చంద్రబాబుకు అన్ని విధాలా పూర్తిస్ధాయి మద్దతు ప్రకటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

  చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా, లేక అధికారంలో ఉన్న తమ మద్దతును ఒక వర్గం మీడియా అందిస్తూనే ఉంది. అయితే, ఎన్నడూ చంద్రబాబు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. దానికి తగ్గట్లే, ప్రతిపక్షాలు కాడా ఇదే విషయమై చంద్రబాబును తరకూ నిలదీస్తుంటాయి.

తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండే కాక, గడచిన ఎన్నికలు మొదలైనప్పటి నుండి కూడా చంరబాబుకు వంతపాడే  ఒక వర్గం మీడియా ప్రతిపక్ష నేత జగన్ను అనేక విధాలుగా వెంటాడి వార్తలు వార్చిన సంగతి అందరికీ తెలిసిందే.

   అందుకనే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలీకుండా ఒక వర్గం మీడియా కాపు కాస్తున్నట్లు వైసీపీ బాహటంగానే విరుచుకుపడుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ, మచిలీపట్నం పోర్టుకు భూముల సేకరణ, భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటు..ఇలా ఏ విషయంలో చూసుకున్న ప్రజల మనోభావాలను సమాజంముందుచటంలో టిడిపికి ఒక వర్గం మీడియా పూర్తిగా మద్దతు ఇచ్చి చంద్రబాబును కాపాడుకుంటోందని వైసీపీ నేతలు తరచూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు  మరి, ఇటువంటి సమయంలో ప్రతిపక్షాలు లేకుండా మీడియా సహకారం తీసుకుంటున్నట్లు బహిరంగంగా అంగీకరించటం గమనార్హం.

  

PREV
click me!