
మానుతున్న పుండును కేంద్రం అనవసరంగా కెలుక్కుంటోంది. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజిని వివరించేందుకు జైట్లీ వస్తున్నారు. ఈనెల 28వ తేదీన విజయవాడలో జరుగనున్న బహిరంగసభలో కేంద్రమంత్రి పాల్గొంటారు. విభజన చట్టాన్ని అమలు చేయటంలో అటు కేంద్రం, అమలు చేయించటంలో ఇటు చంద్రబాబు విఫలమయ్యారని ప్రజలు మండిపడుతున్నారు.
ఈ నేపధ్యంలో ఆ మధ్య ఎవరికీ అర్ధంకాని రీతిలో జైట్లీ ఏదో ప్రకటించారు.. దాన్నే చంద్రబాబు మహాప్రసాదం లాగ స్వీకరించారు. దాంతో యావత్ ప్రజానీకం మండిపడింది. అయినా రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇక ఏమి చేసినా కేంద్రం నుండి అంతకన్నా ఆశించేందుకు లేదన్న విషయం ప్రజానీకానికి అర్దమైపోయింది. దాంతో చేసేది లేక ఉసూరుమంటూ కూర్చున్నారు. ఈ నేపధ్యంలో జైట్లీ వచ్చి ప్యాకేజి వివరాలను వివరించటమంటే అనవసరంగా మానుతున్న పుండును మళ్ళీ కెలుక్కోవటం అవుంతుందేమో.