ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి..?

By telugu news team  |  First Published Mar 17, 2023, 2:20 PM IST

మీ పై మీకు కాన్ఫిడెన్స్ ఉండటంతో పాటు... జీవితంలో మీకున్న లక్ష్యాలపై కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి.


అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా తంటాలు పడుతూ ఉంటారు. అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.... సులభంగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

1.మీరు నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడితే... వారిని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటే... ముందుగా వారు చెప్పేది వినాలి. వారు చెప్పే విషయాన్ని పూర్తిగా విని దాని గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలి. అప్పుడు వారు బాగా ఇంప్రెస్ అవుతారు.

Latest Videos

undefined

2.మీరు నిజంగా ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అంటే... మీరు చాలా కాన్ఫిడెన్స్ తో ఉండాలి. మీరు బెరుకుగా ఉంటే మీరు వారికి నచ్చకపోవచ్చు. కాబట్టి కాన్పిడెంట్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి. మీ పై మీకు కాన్ఫిడెన్స్ ఉండటంతో పాటు... జీవితంలో మీకున్న లక్ష్యాలపై కూడా కాన్ఫిడెంట్ గా ఉండాలి.

3.ప్రతి విషయంలోనూ ముఖ్యంగా ఆమెకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న విషయం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇలా శ్రద్ధ చూపించే వారికి అమ్మాయిలు త్వరగా ఇంప్రెస్ అవుతారు.

4.గౌరవం. ఇది ఏ బంధంలోనైనా చాలా ముఖ్యం. మీరు నిజంగా ఎవరినైనా ఇష్టపడితే.... వారికి గౌరవం ఇవ్వండి.  వారి గౌరవం తగ్గంచే కామెంట్స్ చేయడం, మర్యాద లేకుండా మాట్లాడటం మానుకోవాలి.

5.మీరు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే మీలో కొంచెం అయినా హ్యూమర్ ఉండాలి. అప్పుడప్పుడు సరదా జోక్స్ తో ఆమెను నవ్విస్తూ ఉండాలి. జీవితంలో తమను నవ్వించేవారిని ఎవరూ వదులుకోవాలని అనుకోరు.

6.ఆమెతో రొమాంటిక్ గా ఉండటం కూడా తెలిసి ఉండాలి. సర్ ప్రైజ్ బహుమతులు ఇవ్వాలి. సరదాగా డిన్నర్ డేట్ కి తీసుకువెళ్లాలి.  అప్పుడు వారు కచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.

7.వారికి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ గా నిలపడటం నేర్చుకోవాలి. ఆమె కలలు, లక్ష్యం చేరుకోవడానికి మీ వంతు సహాయం మీరు అందించాలి.
 

click me!