వయసు పెరుగుతుంటే... కోరికలు కూడా..

By telugu team  |  First Published Oct 8, 2019, 3:14 PM IST

యవ్వనంలో కన్నా.. 30నుంచి 40ఏళ్ల వయసులోనే ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయని ఆ సర్వేలలో తేలింది. ఈ సర్వేలో మొత్తం మహిళలే పాల్గొనడం గమనార్హం.


యుక్తవయసులో ఉన్నవారికి శృంగారపరమైన కోరికలు ఎక్కువగా ఉంటాయని.. వయసు పెరిగేకొద్ది ఆ కోరికలు క్రమంగా తగ్గిపోతాయని చాలా మంది భావిస్తుంటారు. అయితే.. ఆ భావన కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.

 ముఖ్యంగా స్త్రీలలో అయితే.. యుక్త వయసులో కన్నా.. మోనోపాజ్ దశలోనే ఎక్కువగా కోరికలు కలుగుతాయట.ఈ అంశంపై రెండు సంస్థలు సర్వే చేయగా.. ఆ రెండు సంస్థల రిజల్స్ ఒకేలా రావడం గమనార్హం. 

Latest Videos

undefined

యవ్వనంలో కన్నా..  30నుంచి 40ఏళ్ల వయసులోనే ఎక్కువగా కోరికలు కలుగుతున్నాయని ఆ సర్వేలలో తేలింది.  ఈ సర్వేలో మొత్తం మహిళలే పాల్గొనడం గమనార్హం.

ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 75శాతం మంది మహిళలు మోనోపాజ్ దశ వారి రిలేషన్ మీద ప్రభావం చూపిస్తోందని చెప్పారు. సాధారణంగా 40ఏళ్లు దాటగానే మహిళలు మోనోపాజ్ దశకు చేరుకుంటారు. దీని వల్ల వారి హార్మోన్లలో అసమతుల్యం ఏర్పడుతుంది. దీంతో.. ఆ వయసులో శృంగారం పట్ల కోరికలు కాస్త ఎక్కువగా కలుగుతాయని ఆ సర్వేలో తేలింది.

ఇదే విషయంపై మరో సర్వేలో  తమ శృంగార జీవితం గతంలో కంటే మోనోపాజ్ తర్వాతే బాగుందని మహిళలు చెప్పడం విశేషం.  20 నుంచి 30ఏళ్ల వయసులో తాము నెలలో 10సార్లు మాత్రమే శృంగారంలో పాల్గొనేవాళ్లమని.. మోనోపాజ్ తర్వాత అది రెట్టింపు అయ్యిందని వారు చెబుతున్నారు. 34నుంచి 38ఏళ్ల మధ్య వయసులో తాము శృంగార జీవితాన్ని బాగా ఆస్వాదించామని వారు చెబుతున్నారు. ఈ సర్వేలో దాదాపు వెయ్యి మంది మహిళలు పాల్గొన్నారు. 

click me!