ప్రేమ జంట అయినా.. భార్యా భర్తలైనా.. ఇద్దరి మధ్య ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇద్దరూ కలిసి నిండూ నూరేళ్లు కలిసి అన్యోన్యంగా బతకాలంటే మాత్రం ప్రేమతో పాటుగా ఇంకొన్ని విషయాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకపోతేనే విడిపోతే బాగుండు అనేదాకా వెళుతుంది.
ప్రేమ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేనంతగా ప్రేమించడమేనా? కలిసి జీవించాలంటే ప్రేమ ఒక్కటి ఉంటే సరిపోతుందా? మిగతావేవీ అవసరం లేదా? అంటే ఖచ్చితంగా కావాల్సిందే. ప్రేమ ఒక్కటే ఉంటే.. ఎక్కువ కాలం కలిసి బతకలేరు. అన్యోన్యత కరువవుతుంది. అసలు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రేమతో పాటుగా ఇంకా ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గౌరవం
undefined
గౌరవం లేని చోట బతకడం చాలా కష్టం అనే మాటను వినే ఉంటారు. రిలేషన్ షిప్ లో కూడా అంతే. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకున్నప్పుడే ఆ బంధం నిండు నూరేళ్లు ఆనందంగా సాగుతుంది. అందుకే నలుగురిలోనే కాదు మీరు ఒక్కరున్నా మీ భాగస్వామిని గౌరవించండి. వారి అవసరాలను తీర్చండి.
స్వేచ్ఛా, స్వాతంత్య్రం
స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లేకుండా బతకడం చాలా చాలా కష్టం. ఇంతకంటే మరో దారుణం ఉండదేమో. ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఇతరులతో ఎలా మాట్లాడాలి? అంటూ అన్నింటినీ ఇతరులే చెప్తే మీరంటూ ఉన్నా లేనట్టే. అవును జీవితం అన్నప్పుడు మీకు నచ్చినట్టు ఉండాలి. అన్ని భాగస్వామి చెప్పినట్టే చేస్తే ఏదో ఒకరోజూ నేనంటూ లేనే అనిపిస్తుంది. అందుకే రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నేను చెప్పినట్టే వినాలి అని భావించకండి.
నమ్మకం
ఏ బంధానికైనా సరే నమ్మకం, నిజాయితీ అవసరం. ఇవి లేని చోట ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ప్రేమ అయినా, పెళ్లి అయినా సరే మీ బంధం బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా నిజాలనే చెప్పాలి. లేనివి ఉన్నట్టుగా కట్టు కథలు అల్లితే మాత్రం మీపై నమ్మకం మొత్తం పోతుంది. ఇది ఆకరికి మీరు విడిపోయే దాకా తీసుకెళుతుంది.
కమ్యూనికేషన్
రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ ముఖ్యమైనది. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంటేనే మీ బంధం బాగుంటుంది. లేదంటే మీరు త్వరగా విడిపోవచ్చు. కమ్యూనికేషనే మీ ఇద్దరినీ జీవితాంతం కలిసి ఉండేలా చేస్తుంది. మీ ఇద్దరి మధ్యన మాటలు లేకుంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేరు. నువ్వెవ్వరో నేనెవ్వరో అన్నటే సాగుతుంది. ఇలాంటి రిలేషన్ షిప్ ఎక్కువ రోజులు ఉండదు.
లైంగిక అనుకూలత
సెక్స్ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది. లైంగిక జీవితం బాగుంటేనే మీ మిగతా జీవితం అంతా సాఫీగా సాగుతుంది. నిజానికి వైవాహిక జీవితంలో ఇది చాలా అవసరం. ఇది లేకుండా మీరు ఎంత ప్రేమను చూపినా వేస్టే. మీ ఇద్దరి మధ్య లైంగిక జీవితం సాఫీగా సాగేలా చూడండి.