భారత హాకీ లెజెండర్ బల్బీర్ సింగ్ కన్నుమూత

By telugu news teamFirst Published May 25, 2020, 9:11 AM IST
Highlights

కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

ప్రముఖ హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్(96) మృతి చెందారు. మూడుసార్లు ఒలంపిక్ బంగారు పతకం సాధించిన  భారత హాకీ జట్టులో బల్బీర్ సింగ్ కీలక సభ్యుడు కావడం గమనార్హం. కాగా.. వయసు రీత్యా.. ఆయన గత కొంతకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా... కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు అధికారికంగా ప్రకటించారు. కాగా.. ఆయన మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం 6గంట 30నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. బల్బీర్ సింగ్ కి ఓ కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కాగా.. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మే 8వ తేదీన మొహాలిలోని ఆస్పత్రిలో  చేర్పించారు. ఆయన బ్రెయిన్ లో రక్తం గడ్డగట్టడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

భారత హాకీ చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఓ పేజీని లిఖించుకున్నారు. కాగా.. ఆయన మరణం పలువురిని విషాదంలోకి నెట్టేసింది. 

click me!