అదనపుకట్నం కోసం వేధింపులు.. పోలీసులకు హాకీ టీం మాజీ కెప్టెన్ ఫిర్యాదు

By telugu news team  |  First Published Feb 21, 2020, 2:08 PM IST

తన భర్త తనను దూర్భాషలాడుతాడని ఆమె చెప్పడం గమనార్హం. తాను ఈ విషయాన్ని పబ్లిక్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని.. అతనిలో మార్పు వస్తుందని ఎదరుచూశానని చెప్పారు.



భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ సురాజ్ లతా దేవి  మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తన భర్త అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఇంపాల్ లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

Also Read ఒకప్పుడు ఐపిఎల్ స్టార్ క్రికెటర్: ఇప్పుడు చోర్, కారులో నివాసం.

Latest Videos

undefined

పెళ్లైన నాటి నుంచి తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడని ఆమె చెప్పింది.  అనైతిక ప్రవర్తన కారణంగానే తనకు అర్జున అవార్డు వచ్చిందని తన భర్త తనను దూర్భాషలాడుతాడని ఆమె చెప్పడం గమనార్హం. తాను ఈ విషయాన్ని పబ్లిక్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదని.. అతనిలో మార్పు వస్తుందని ఎదరుచూశానని చెప్పారు.

అయితే.. సహనానికి కూడా హద్దు ఉంటుందని.. తనలోని సహనం కోల్పోయానని ఆమె చెప్పారు. అందుకే భర్తపై ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, 2005లో శాంతా సింగ్‌ అనే రైల్వే ఉద్యోగిని పెళ్లాడిన ఆమె హాకీ ఆటకు దూరమయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గతంలో కూడా ఆమె పలుమార్లు భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2002లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో సురాజ్‌ లతా దేవీ సారధ్యంలోని ఇండియన్‌ ఉమెన్‌ హాకీ టీం మూడు బంగారు పతకాలు సాధించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఉమెన్‌ హాకీ టీం కనబరిచిన ప్రతిభ స్ఫూర్తిగా బాలీవుడ్‌లో ‘ చక్‌ దే ఇండియా’ అనే సినిమా తెరకెక్కింది.

click me!