అమెరికాలో చిక్కుకుపోయా.. కాపాడండి.. హాకీ ప్లేయర్ అశోక్

By telugu news teamFirst Published Apr 10, 2020, 9:36 AM IST
Highlights

తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న తనను స్వదేశం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు రంగంలోకి దిగిన క్రీడా శాఖ.. విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకుపోయింది. కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటోలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లిన దివాన్‌.. ఈనెల 20న స్వదేశం రావాల్సి ఉంది.

తాను అమెరికాలో చిక్కుకుపోయానని.. ఎవరైనా రక్షించాలని.. తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని హాకీ ఒలింపియన్‌, 1975 వరల్డ్‌ కప్‌ గెలిచిన భారత జట్టు సభ్యుడు అశోక్‌ దివాన్‌ కోరుతున్నారు. ఆయన ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లగా.. అక్కడ చిక్కుకుపోయారు.

Also Read కరోనా కోసం మ్యాచ్‌లు ఆడదామన్న అక్తర్: ఇండియా వద్ద బోల్డంత డబ్బుందన్న కపిల్...

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. దాని ప్రభావం అమెరికాలో మరింత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తనను భారత్ కి తీసుకువచ్చేందుకు సహకరించాలని అశోక్ దివాన్ కోరుతున్నారు.

తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులుపడుతున్న తనను స్వదేశం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు రంగంలోకి దిగిన క్రీడా శాఖ.. విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకుపోయింది. కాలిఫోర్నియా రాజధాని సాక్రమెంటోలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లిన దివాన్‌.. ఈనెల 20న స్వదేశం రావాల్సి ఉంది.

 కానీ కరోనా మహమ్మారితో ఆయన ప్రయాణం వాయిదాపడింది. మరోవైపు దివాన్‌ను హఠాత్తుగా ఆరోగ్య సమస్యలుు చుట్టుముట్టాయి. దాంతో తనను అమెరికానుంచి రప్పించాలని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నరీందర్‌ బాత్రాను అశోక్‌ అభ్యర్థించారు. ఈ విషయాన్ని బాత్రా.. క్రీడా మంత్రి కిరణ్‌ రెజిజు దృష్టికి తీసుకుపోయారు. విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి అశోక్‌ను స్వదేశం రప్పించేలా చూడాలని కోరారు.

click me!