ఒక పోలిక చిచ్చే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమయ్యింది. ఇలాంటి తరుణంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు కెసిఆర్ కు మునిసిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు మరో అస్త్రం కానుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటినుండి రెండు రాష్ట్రాల మధ్య పోలికల చిచ్చు రగులుతూనే ఉంది. అలంటి ఒక పోలిక చిచ్చే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కారణమయ్యింది.
ఇలాంటి తరుణంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు కెసిఆర్ కు మునిసిపల్ ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు మరో అస్త్రం కానుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కడప స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేసారు. శంకుస్థాపన చేయడంతోపాటు కేంద్రం దీనికి సహకారం అందించినా అందించకపోయినా సరే మేము దీన్ని నిర్మించి తీరుతామని అన్నాడు. అందుకోసం 15వేల కోట్లు ఖర్చు అవుతాయని వీటిని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరించడానికి కూడా సిద్ధమని అన్నాడు.
కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో 15వేల కోట్లతో ఇంత భారీ ప్రాజెక్టును నిర్మిస్తే అది నిజంగా అక్కడి ప్రజలకు చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు... అక్కడి ప్రాంతమంతా భాగపడుతుంది.
Also read; జార్ఖండ్ లో బిజెపి ఓటమి: కేసీఆర్, జగన్ లకు ఊరట
ఇక్కడే జగన్ ఎందుకు కేంద్రం సహకరించినా..సహకరించకపోయినా అనే మాట వాడాడు అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అప్పటి కేంద్రప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డ 6నెలల్లోపు ఆంధ్రప్రదేశ్ లోని కడపలో, తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం సర్వే నిర్వహస్తామని అన్నారు.
విభజన అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ కూడా అధికారంలో కోల్పోయింది. అప్పటి నుండి కేంద్రాన్ని అడిగిన ప్రతిసారి కూడా కడపలో, బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం క్వాలిటీ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సరిపోదని వాదిస్తోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కేంద్రం తో మాట్లాడి ఎన్ఎండిసి నుండి ముడి ఖనిజ సరఫరాకు కూడా ఒప్పించాడు.
పూర్తి ఖర్చును కూడా భరించడానికి ముందుకు వచ్చి, ముడి ఖనిజాన్ని కూడా సంపాదించడంతో ఇప్పుడు తెలంగాణాలో కూడా ఈ డిమాండ్ ఊపందుకునే ఆస్కారం ఏర్పడింది. పేద రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ నిర్మించుకోగలిగితే...ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ కలిగిన తెలంగాణ రాష్ట్రం ఎందుకు నిర్మించుకోలేదనే ప్రశ్నలు బయల్దేరుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు వంటి అనేక నినాదాలతోపాటు, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసితీరుతామని అప్పట్లో కేటీఆర్ తో సహా అనేకమంది తెరాస ముఖ్యనేతలు ప్రకటించారు. కేంద్రం సహకారం అందించనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సొంతగా ఏర్పాటు చేసుకుంటుందని అన్నాడు.
ఎన్నికలు పూర్తయి 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత తెరాస ప్రభుత్వం అక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం సర్వే కూడా చేయించింది. ఆ తరువాత ఆ విషయమా మరుగున పడిపోయింది. ఇప్పుడు జగన్ కడపలో శంకుస్థాపన చేయడంతో తెలంగాణాలో మరోమారు ఈ డిమాండ్ ఊపందుకునే అవకాశం ఉంది.
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే ఖర్చు భారీగా అవుతుంది. అక్కడ నిర్మాణాలు చేయడంతోపాటు ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా రైల్వే లైన్ ని ఏర్పాటు చేయవలిసి ఉంటుంది. అదృష్టవశాత్తు మహబూబాబాద్ పక్కనే ఉండడంతో అది పెద్ద ఇబ్బంది కాకునప్పటికీ...తెలంగాణాలో ప్రస్తుతానికి భారీ ఎత్తులో సాగునీటి ప్రోజెక్టుల నిర్మాణం జరుగుతుంది.
Also read: కేసీఆర్ పై జ'గన్': ఇద్దరు సిఎంల మధ్య తెలంగాణలో పోలిక చిచ్చు
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయానికి అవసరమయ్యే డబ్బుకోసమే కొత్తగా అప్పులు చేసే పనిలో బిజీగా ఉంది న్టర్స్ సర్కారు. అలాంటిది ఇప్పుడు మరో 10వేల కోట్ల పెట్టుబడి అంటే తెలంగాణ సర్కార్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
ఇప్పుడు దగ్గర్లో మునిసిపల్ ఎన్నికలున్నాయి. ఎన్నికలవేళ ఇలాంటి డిమాండ్ గనులా తెర మీదకు వస్తే ఎలా అనే భయం కూడా కెసిఆర్ సర్కార్ ను పట్టి పీడిస్తుంది. కెసిఆర్ రెండోదఫా పాలనపై ప్రజలు ఒకింత అసంతృప్తితో ఉన్నారనే మాట వాస్తవం.
కెసిఆర్ మిగిలిన పార్టీ నేతలకన్నా బాగానే పాలన సాగించినప్పటికీ కెసిఆర్ రెండో ధఫాను ప్రజలు కెసిఆర్ మొదటి ధఫాతో పోల్చి చూసుకుంటున్నారు. అంటే కెసిఆర్ వెర్సస్ కెసిఆర్ అన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డిమాండ్ ను కెసిఆర్ ఎలా హేండిల్ చేస్తారో వేచి చూడాలి.