టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని బిజెపి ఏపీ అధ్యక్షుడు వరుస వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబును సోము వీర్రాజు లక్ష్యం చేసుకోవడం వెనక పక్కా ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోకసభ ఎన్నిక నేపథ్యంలో బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని వరుసగా వ్యాఖ్యలు చేయడం వెనక పక్కా ప్లాన్ ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అంతగా వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబును టార్గెట్ చేయడమేమిటనే ఆశ్చర్యం చాలా మందికి కలుగుతుంది. కానీ, వ్యూహాత్మకంగానే సోము వీర్రాజు చంద్రబాబును, టీడీపీని లక్ష్యంగా చేసుకున్నట్లు అర్థమవుతోంది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ప్రస్తుతం టీడీపీ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఆ విష,యం అర్థమవుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా ప్రజలకు టీడీపీనే ప్రత్యామ్నాయంగా కనిపించే అవకాశం ఉంది. దాన్ని దెబ్బ తీయడమే సోము వీర్రాజు వ్యూహంగా కనిపిస్తోంది. చంద్రబాబు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, వాటికి విరుద్ధంగా ఆ తర్వాత చేసిన ప్రకటనలను ఆయన ఎత్తిచూపడం ద్వారా టీడీపీని బలహీనపరచాలని ఆయన చూస్తున్నట్లు అనిపిస్తోంది.
undefined
Also Read: చంద్రబాబుకు మరో షాక్: యూటర్న్ మీద సోము వీర్రాజు ట్వీట్
వైసీపీకి బిజెపిని ప్రత్యామ్నాయంగా నిలబెట్టాలంటే టీడీపీని వెనక్కి నెట్టక తప్పదు. టీడీపీని వెనక్కి నెట్టి, దాని స్థానాన్ని తాము భర్తీ చేయాలనేది సోము వీర్రాజు ఉద్దేశంగా కనిపిస్తోంది. తమ పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి నడుస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి జనసేన, బిజెపి పనికి వచ్చాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ రెండు పార్టీలు టీడీపీకి దూరమయ్యాయి. దాదాపుగా టీడీపీ రాష్ట్రంలో ఒంటరైంది. దీంతో టీడీపీ బలం తగ్గినట్లే. కానీ వైసీపీకి ఇప్పటికీ పోటీ ఇచ్చే పార్టీగా టీడీపీనే చూస్తున్నారు.
తిరుపతి లోకసభ ఎన్నికల్లో పోటీని వైసీపీకి, తమకు మధ్య మార్చాలన్నా కూడా టీడీపీని వెనక్కి నెట్టడం అవసరం. చంద్రబాబును బలహీనపరచడం ద్వారా ఆ పనిచేయాలని సోము వీర్రాజు అనుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రత్నప్రభకు జనసేన మద్దతు కలిసి వస్తుంది. జనసేనకు తిరుపతి లోకసభ పరిధిలో గణనీయమైన ఓటు బ్యాంకే ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో మరింత బలం పుంజుకోవడానికి సోము వీర్రాజు టీడీపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు.
Also Read: చంద్రబాబుకు షాక్: పనబాక లక్ష్మి వ్యాఖ్యలను ట్వీట్ చేసిన సోము వీర్రాజు
చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇంతకు సోము వీర్రాజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెసులో ఉన్నప్పుడు పనబాక లక్ష్మి చంద్రబాబుపై తాజాగా ఆయన ప్రత్యేక హోదాను వదులుకుంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు అనుకూలంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తన ట్వీట్ లో ఎత్తిచూపారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.