వికెట్ల వెనుక రాహుల్.... మరో ధోనిని తలపిస్తున్నాడోచ్!

By telugu teamFirst Published Jan 26, 2020, 4:45 PM IST
Highlights

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా 30 యార్డ్ సర్కిల్ బయట ఉన్నప్పటికీ కూడా అన్ని అనుకున్నట్టు జరిగిపోతున్నాయంటే... దానికి కారణం రాహుల్. అతడు వికెట్ల వెనుక మరో ధోనీల తయారయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

నేటి మ్యాచులో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ని తక్కువ స్కోరుకే కట్టడి చేసారు. వరుస వికెట్లతో న్యూజిలాండ్ వెన్ను విరిచారు అని చెప్పవచ్చు. భారత ఫీల్డర్ల ప్లేస్ మెంట్ కూడా ఎంత చాకచక్యంగా ఉందంటే... న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఫోర్లు కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. 

ఈ మ్యాచులో ఆసక్తికర అంశం, అందరిని ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే... వికెట్ల వెనకున్న కెఎల్ రాహుల్. కోహ్లీ, రోహిత్ లు ఇద్దరు 30 యార్డ్ సర్కిల్ అవతల ఫీల్డింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఫీల్డింగ్ ప్లాసీ మెంట్ ప్రతి బంతికి చాలా కరెక్ట్ గా, బ్యాట్స్ మెన్ ని జడ్జ్ చేస్తూ ఫీల్డింగ్ చేస్తూ ఉన్నారు ఇతర ఆటగాళ్లు. 

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా 30 యార్డ్ సర్కిల్ బయట ఉన్నప్పటికీ కూడా అన్ని అనుకున్నట్టు జరిగిపోతున్నాయంటే... దానికి కారణం రాహుల్. అతడు వికెట్ల వెనుక మరో ధోనీల తయారయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 

Also read: పంత్ భవితవ్యంపై నీలి నీడలు... వాట్ నెక్స్ట్...?

అతడు కీపింగ్ చేస్తూ బ్యాట్స్ మెన్ ఇటుగా ఆడుతున్నారో క్షుణ్ణంగా గమనిస్తూ ఫీల్డ్ ప్లేస్ మెంట్స్ చేస్తున్నాడు. అతడి ఆటతీరులో కాన్ఫిడెన్స్ అతని కీపింగ్ పై కూడా కనబడుతుంది. బ్యాటింగ్ ఇచ్చే బూస్ట్ జీవం టోన్ వంటిది. 

కెరీర్ ఆరంభంలో ధోని కూడా కీపింగ్ లో అంత మెరుగైన ఆటగాడు కాదు. కానీ రాను రాను అతని బ్యాటింగ్ ఇచ్చిన ఆత్మ విశ్వాసం అతడిని ప్రపంచంలోని మేటి కీపేర్లలో ఒకడిగా నిలిపింది.

రాహుల్ కూడా మరి తీసిపారేసే కీపర్ ఏమి కాదు. అతడు దేశవాళీలో కర్ణాటకకు కీపింగ్ చేస్తాడు. ఐపీఎల్ లో కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అతడే కీపర్. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అతడి ఆటతీరుతో వస్తున్న పరిణితిని మనం గమననించవచ్చు. 

ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే... ఏ స్థానంలో ఆడమన్న నేను రెడీ అన్నట్టుగా ప్రతి పనికి తాను సిద్ధం అంటూ ముందుకు వస్తున్నాడు. ఓపెనర్ గా ఆడమంటే ఓపెనర్ గా నెంబర్ 3, 4, 5 అన్ని స్థానాల్లోనూ ఆడుతూ.. అతను ఎంత విలక్షణమైన ఆటగాడో నిరూపించుకుంటున్నాడు. 

టీం ఇండియా సక్సెస్ కి రాహుల్ లాంటి విలక్షణమైన ఆటగాడి అవసరం చాలా ఉంది. అతని అవసరం విరాట్ కోహ్లీకి కూడా చాలా ఉంది. ప్రపంచంలోనే మేటి ఫీల్డర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. బౌండరీ లైన్ వద్ద అతడొక్కడు ఉన్నాడంటే ఇద్దరు ఫీల్డర్లతో సమానం. అంత డిస్టెన్స్ ని కవర్ చేస్తాడు. 

విరాట్ బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 30 యార్డ్ సర్కిల్ లోపల బౌలర్లకు చేదోడువాదోడుగా ఉంటూ, ఫీల్డింగ్ ని కూడా సెట్ చేయగల ఒక కీపర్ భారత్ కి అవసరం. పంత్ రూపంలో అలంటి ఒక కీపర్ దొరుకుతాడేమో అని ఆశించిన టీం ఇండియాకు అలంటి ఒక కీపర్ దొరకలేదు. 

ఇప్పుడు రాహుల్ రూపంలో ధోనిని గుర్తుచేయగల ఒక కీపర్ మాత్రం భారత్ కు ఖచ్చితంగా దొరికినట్టు మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు టీంలో చోటు దక్కుతుందా లేదా అని మాధానపడే రాహుల్ ఇప్పుడు తనకు తాను ఖచ్చితంగా టీంలో చోటు దక్కుతుందని చెప్పుకోగలిగే స్టేజి కి వచ్చాడు. 

Also read: ముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా

రాహుల్ ఆటతీరులో మెచ్యూరిటీ కూడా కనబడుతుంది. ఈ రోజు చేస్ ని గనుక తీసుకుంటే... ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తక్కువ స్కోర్లకే అవుటయ్యారు. అయినా ఎంత మాత్రం కూడా ప్రెషర్ కి లోనవకుండా శ్రేయస్ తో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు. 

గత మ్యాచ్ లో ఆడిన ఆటకు ఈ మ్యాచులో ఆడిన ఆటకు అసలు పోలిక లేదు. ఈ మ్యాచులో ఆడిన ఆట చాలా నెమ్మదిగా ఆది ఉండొచ్చు, కానీ అతడిని ఒక విలక్షణమైన ఆటగాడిగా మాత్రం ఈ మ్యాచ్ నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఎకాడ తొందరపడకుండా చిన్నగా సింగిల్స్ టాస్ తీస్తూ నెమ్మదిగా భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించాడు. 

అతడి ఆట చాలా పరిణితి చెందింది. విరాట్ కోహ్లీ అతడిపై ఉంచుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెడుతూ ఆడుతున్నాడు రాహుల్. గతంలో కూడా చెప్పినట్టు కోహ్లీకి ముందు రాహుల్, ఆ తరువాత శ్రేయస్ భారత బ్యాటింగ్ లైన్ అప్ కి ఎంతో ఉపయుక్తకరమైన కాంబినేషన్. అది మరోసారి నేటి మ్యాచులో నిరూపితమైంది. 

కోహ్లీ ఉన్నంతసేపు విరుచుకుపడ్డ రాహుల్, కోహ్లీ ఔటవ్వగానే నెమ్మదించాడు. మ్యాచ్ చివరి వరకు తాను ఉండాలని డిసైడ్ అయినట్టుగా ఆడాడు. అతడు ఎక్కడా అనవసర షాట్లకు యత్నించకుండా నెమ్మదిగా ఇన్నింగ్స్ ని నిర్మిస్తూ ముందుకు సాగాడు. 

అతడి పరిణితి మనకు అతడు ఎంత కూల్ గా ఉంటున్నాడో దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది. అతడు మ్యాచ్ గెలిచినా తరువాత కూడా మరీ సంబరాలకు పోకుండా టీం ని గెలిపించాను, లేదా టీం కి నా వంతు సహకారాన్ని అందించాను అన్న సంతోషంతో మాత్రమే వెనుదిరుగుతాడు. ఒకవేళ త్వరగా ఔటయితే మాత్రం అనవసరంగా ఔటయ్యాను అన్న బాధ మాత్రం అతడి మొఖంలో స్పష్టంగా కనబడుతుంది. 

ఏది ఏమైనా వికెట్ల వెనుక ఈ సిరీస్ లో రాహుల్ ని చూసినవాళ్లందరికి మాత్రం మరో ధోని ఖచ్చితంగా దర్శనమిచ్చి ఉంటాడు అనడంలో ఎటువంటి సంశయం కానీ శషభిషలు కానీ అవసరం లేదు. 

click me!