పోతుల సునీత ఇష్యూ: మాట తప్పి మడిమ తిప్పిన జగన్

By telugu team  |  First Published Jan 25, 2020, 2:37 PM IST

శాసన మండలిని రద్దు యోచనను అటు పక్కనుంచితే.... తాను అధికారంలోకి రాగానే స్వయంగా తనకు తాను విధించుకున్న కొన్ని నియమాలు ఇప్పుడు జగన్ కు కంటగింపుగా తయారయ్యాయి. అందుకోసమే ఆ విలువలకు తిలోదకాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 


ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు కేవలం ఇరు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా ఈ విషయమై జాతీయ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి.

శాసన మండలిని రద్దు యోచనను అటు పక్కనుంచితే.... తాను అధికారంలోకి రాగానే స్వయంగా తనకు తాను విధించుకున్న కొన్ని నియమాలు ఇప్పుడు జగన్ కు కంటగింపుగా తయారయ్యాయి. అందుకోసమే ఆ విలువలకు తిలోదకాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

Latest Videos

undefined

జగన్ అధికారంలోకి వచ్చాక టీడీపీపై పదే పదే చేసిన ఆరోపణ ఏమిటంటే.... 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు కేవలం అదే 23 సీట్లను మాత్రమే గెల్చుకోగలిగాడు అని ఎద్దేవా చేసారు. 

Also read; శాసనమండలి రద్దు: జగన్ కే అధిక నష్టం, ఎందుకంటే....

ఇలా చంద్రబాబు, టీడీపీ చేసినటువంటి చిల్లర రాజకీయాలు తాను చేయబోనని, ఇతర పార్టీలనుంచి ఫిరాయింపుదారులను చేర్చుకోబోనని తెలిపాడు. ఒకవేళ ఎవరైనా పదవిలో ఉన్న నేత వైసీపీలో చేరాలంటే ఒక కండిషన్ పెట్టాడు. 

ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే... తమ పదవికి రాజీనామా చేసి ఆతరువాత వైసీపీలో చేరాలని జగన్ షరతు పెట్టారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కూడా సమర్థించారు. 

ఇలా సాగుతున్న తరుణంలో వల్లభనేని వంశీ రూపంలో తొలి వికెట్ టీడీపీ నుండి బయటకు వెళ్లేందుకు రెడీ అయ్యింది. వంశీ పార్టీలోనే ఉంటూ... చంద్రబాబును, టీడీపీని ఇష్టం వాచినట్టు తిట్టి, అనేక రకాలైన ఆరోపణలు చేసి టీడీపీ నుండి బహిష్కరణకు గురయ్యాడు. 

అలా టీడీపీ బహిష్కృత నేతగా టీడీపీ సభ్యుల వెనకాల కూర్చుంటున్నాడు అసెంబ్లీలో. ఇదే దారిలో పయనిస్తూ వంశీ పక్క సీట్ లోనే కూర్చుంటున్నాడు మరో శాసనసభ్యుడు మద్దాలి గిరి. 

వీరు కూడా వాస్తవానికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని అనుకున్నప్పడికి... మళ్ళీ ఎన్నికలకు వెళితే గెలవడం కష్టమని భావించి, దానితోపాటు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు గనుక వస్తే... గతంలో అక్కడి నుండి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు సైతం టికెట్ కోసం ఆశపడుతారు. ఇప్పటికి వంశీ విషయంలో యార్లగడ్డ చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. అందరికి ఆ అజ్ఞ్యాతవాసాలు గుర్తుండే ఉంటాయి. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో టెక్నికల్ గా వైసీపీలో చేరకుండా అలా పక్కన కూర్చుంటున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఏదో ఆ ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి జగన్ వారిని అలా కూర్చోబెట్టాడు అనుకుందాం. 

Also read; ఏపీ మండలి రాద్ధాంతం: తలా పాపం తిలా పిరికెడు

ఒక్కసారి గనుక మండలి విషయానికి వచ్చేసరికి తొలుత డొక్కా, శమంతకమణి గైరుహాజరయ్యారు. సరే ఇది కూడా ఓకే. టెక్నికల్ గా  వారిని ఆబ్సెంట్ అయ్యాయేలా చెయ్యడం రాజకీయ వ్యూహంలో ఒక భాగం అనుకోవచ్చు. ఎవెర్య్థింగ్ ఐస్ ఫెయిర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లవ్, వార్ అండ్ పాలిటిక్స్. 

వీటితరువాత జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు జగన్ విలువలను, ఆయన రాజకీయ ఇమేజ్ ను ప్రశ్నఅర్థకంలోకి నెట్టేస్తున్నాయి. ఆయనే రాజీనామా చేసి వస్తే తప్ప చేర్చుకొనియు అన్నవాడు ఇప్పుడు ఏకంగా పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించాడు. 

అందరిలాంటి రాజకీయ నాయకుడను కాదు తాను విలువలతో కూడిన రాజకీయాలను చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఇలా అందరిని పార్టీలోకి ఆహ్వానించడం... ఆయన విధించుకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వడం వంటిది. 

ఇలా ఇతర రాజకీయ నాయకులూ చేయలేదా అనే ప్రశ్న రావడం సహజం. కానీ జగన్ లా వారు ఏ నాడు పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలనే కండిషన్ పెట్టినవారు కాదు. అంతే కాకుండా వారిని రాజకీయాల్లో డిఫరెంట్ గా చూడరు. ఇతర రాజకీయ నాయకులతోపాటుగా కలిసిపోయినట్టుగానే చూస్తారు. 

ఇప్పుడు జగన్ ఇలా ఇతర పార్టీలనుంచి వచ్చిన నేతలను చేర్చుకోవడం రాజకీయంగా జగన్ కి లాభమే అయినా... నైతికంగా మాత్రం రాజన్న రాజ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మాటతప్పడం ఆయన పొలిటికల్ ఇమేజ్ ని మాత్రం డామేజ్ చేసేదిలా కనబడుతుంది. 

click me!