కేసీఆర్ కు మరో తలనొప్పి పెట్టిన ఏపీ సీఎం వైఎస్ జగన్

By telugu teamFirst Published Oct 30, 2019, 5:24 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో తలనొప్పి తెచ్చిపెట్టినట్లే ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండు నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వారికి ఉప కులాలవారీగా కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు కెసిఆర్ కు తలనొప్పులు తెచ్చిపెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆర్టీసీ సమ్మెకు ట్రిగరింగ్ పాయింట్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయమే. తాజాగా మరో జగన్ క్యాబినెట్ నిర్ణయం తెలంగాణాలో నూతన చిచ్చు పెట్టేలా ఉంది. 

ఎస్సి కార్పొరేషన్ ను విభజించడానికి నిర్ణయం తీసుకుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఎస్సి కార్పొరేషన్ ను మాల కార్పొరేషన్,రెల్లి కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్లుగా విభజించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణాలో కూడా ఎప్పటి నుండో ఎస్సి కులాల వర్గీకరణ గురించి చర్చ నడుస్తుంది. కేసీఆర్ కూడా తెలంగాణ వస్తే ఖచ్చితంగా కులాల వర్గీకరణ చేస్తాము అని చెప్పారు. మంద కృష్ణ మాదిగ ఈ డిమాండ్ పై తీవ్ర పోరాటమే చేసారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మరోసారి తెలంగాణాలో చిచ్చు పెట్టేదిగా ఉంది. 

Also read: కేసీఆర్ పై జ'గన్': ఇద్దరు సిఎంల మధ్య తెలంగాణలో పోలిక చిచ్చు

వాస్తవానికి ఈ వర్గీకరణ తొలిసారి చంద్రబాబు సర్కార్ హయాంలో తెరమీదకు వచ్చింది. ఎస్సి కులాలను ఎ ,బి,సి,డి కులాలుగా వారి వెనుకబాటుతనం ఆధారంగా గుర్తించేందుకు చంద్రబాబు దీనిని ఎస్సి రిజర్వేషన్(రేషలైజేషన్) ఆక్ట్ 2000 పేరిట దీన్ని తీసుకురావడం జరిగింది. కాకపోతే సుప్రీమ్ కోర్ట్ దీన్ని కొట్టేసింది. 

ఎస్సి వర్గీకరను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ,రాష్ట్ర అసెంబ్లీకి కానీ ఎటువంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. ఇలా వర్గీకరణలు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరని సుప్రీమ్ కోర్ట్ తెలిపింది. 

ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ తన పరిధినెరిగి ఎస్సి వర్గీకరను చేయకుండా కార్పొరేషన్ ను కులాల వారీగా విభజించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణాలో కూడా ఇలానే చేయమని డిమాండ్ తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ ఆదివాసీ,లంబాడాల విషయంలోనే తీవ్రమైన తలనొప్పులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఇది కూడా మొదలైతే కెసిఆర్ సర్కారుకు మరిన్ని నూతన తలనొప్పులు తప్పక పోవచ్చు. 

అంతే కాకుండా ఈ కాబినెట్ సమావేశంలో ఇతర అంశాలపై కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న మరో నిర్ణయం కూడా ఇబ్బందులు కలిగించే ఆస్కారం లేకపోలేదు. 

Also read: ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు: వర్గీకరణకు జగన్ కేబినెట్ విరుగుడు

అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదవారికి ఊరట లభించేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల్లో 300 చదరపు అడుగుల వరకు రెగ్యులరైజ్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని 100 చదరపు గజాలు భూమిలో ఉంటున్న వారు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారైతే 300 చదరపు అడుగుల భూములు కలిగి ఉన్నట్లైతే వారు ప్రభుత్వం నిర్ణయించిన ధరను బట్టి రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. రెగ్యులరైజ్ అయిన భూములను ఐదు సంవత్సరాల వరకు అమ్మకూడదని, ఆ తర్వాత వారికి యజమానిగా హక్కులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న ఇలాంటి నిర్ణయం ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు కేసీఆర్ కు నెత్తి నొప్పి తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. 

Also read: Ap cabinet meet photos: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

click me!