ఎన్టీఆర్ ఇమేజ్ కోసం కేజ్రీవాల్ పాకులాట.... జాతీయ రాజకీయాలకు వేసేనా బాట?

By telugu teamFirst Published Feb 16, 2020, 6:35 PM IST
Highlights

నేటి ఉదయం ప్రమాణస్వీకారం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు కేజ్రీవాల్. మామూలుగా చూడడానికి అవి చాలా చిన్న వ్యాఖ్యలుగా కనబడుతున్నప్పటికీ అన్నిటిని కలిపి చూసినప్పుడు వాటి వెనుక ఉన్న అసలు కారణం మనకు కనబడుతుంది. 

ఢిల్లీ ఎన్నకలు ముగిసాయి. అరవింద్ కేజ్రీవాల్ ఘన విజయం సాధించాడు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఆయన నేటి ఉదయం రామ్ లీలా మైదానంలో ఆయన పార్టీ కార్యకర్తల మధ్య ప్రమాణస్వీకారం చేసారు. 

నేటి ఉదయం ప్రమాణస్వీకారం చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు కేజ్రీవాల్. మామూలుగా చూడడానికి అవి చాలా చిన్న వ్యాఖ్యలుగా కనబడుతున్నప్పటికీ అన్నిటిని కలిపి చూసినప్పుడు వాటి వెనుక ఉన్న అసలు కారణం మనకు కనబడుతుంది. 

ఉదయం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎన్నికలవేళ చిమ్మిన విషం చాలని, ఎన్నికలు ముగిసాయి కాబట్టి వాటిని వదిలేస్తే మంచిదని హితవు పలికాడు. తాను కూడా అన్నిటిని మర్చిపోయినట్టు చెప్పాడు. 

Also read; దేశ రాజధానిలో పాగా వేసిన ఆప్.... జాతీయ రాజకీయ పావులను కూడా కదపటం మొదలెట్టేసింది

ఇక అక్కడి నుంచి మొదలు ఆయన భారతదేశం గొప్పతనం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెబుతూ... తనని తాను ఢిల్లీ పుత్రుడిగా ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసాడు. 

నిశితంగా గనుక గమనిస్తే... తాను ప్రజలకు అన్ని ఉచితంగా ఇస్తున్నానన్న బీజేపీ విమర్శకు చెక్ పెడుతూ... తనని తాను ఇలా చెప్పుకున్నాడు. విద్య వైద్యం ఎప్పటికి ఉచితమేనని, తల్లి ప్రేమ, తండ్రి ఆప్యాయత ఎలాగో ఇది అంతే అని, ఢిల్లీ తన కుటుంబమని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుత నాయకుల్లో చాలా మంది ఇలాంటి ఒక ఆత్మీయ రేలషన్ ని ఏర్పాటు చేసుకున్నవారుగా మనకు కనబడుతారు. ఉదాహరణకు మమతా బెనర్జీని తీసుకుంటే... దీదీ గా ఆమె సుపరిచితురాలు. మాయావతి బెహెన్ జీ గా పిలిపించుకున్నవారే. 

ఎన్టీఆర్ ని అన్నగారు అని పిలవడం మన తెలుగునాట కూడా అలవాటే కదా! ఇలా పిలిపించుకోవడం వల్ల ప్రజలతో ఒక పర్సనల్ బాండింగ్ ను ఏర్పాటు చేసుకోవడం వీలవుతుంది. ఇలా గనుక పర్సనల్ బాండింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే... ప్రజలు వారితో ఒక క్లోజ్ రేలషన్ ఉన్నట్టుగా భావిస్తారు. 

ఉదాహరణకు మన ప్రధాని నరేంద్ర మోడీని తీసుకోండి. ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడారు అనే ఒక బలమైన అపవాదును మోస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్లలో మాట్లాడారు అది నిజమే. మరి ఆయన మీడియా ముందుకు ఎక్కువగా రాకున్నా ఎలా ప్రజల మనిషిగా చలామణి అవుతున్నారు?

అందుకు గల ప్రధాన కారణం పర్సనల్ బాండింగ్. మోడీ మన్ కి బాత్ నుంచి మొదలు రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలతో మాట్లాడుతారు. అందులో సామాన్యుడి నుండి వచ్చే ప్రశ్నలను తీసుకొని వాటిపై మాట్లాడుతుంటారు. 

పిల్లల పరీక్షలపై కూడా మాట్లాడుతుంటే ఆయనకు ప్రజలతో కనెక్షన్ లేదని ఎవరు భావిస్తారు చెప్పండి. ఆయన కేవలం ఇలా ప్రత్యేక కార్యక్రమాల్లోనే కాకుండా పబ్లిక్ సుపీచులో కూడా ప్రజలతో ఒక్కడిగా, ప్రజల్లో ఒక్కడిలా మాట్లాడడం గమనించొచ్చు. 

Also read; కేసీఆర్ ఆశలు గల్లంతు: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ముందు ఢీలా

ఆయన సంతకం ఉన్న పోస్టు కార్డులు ఇప్పటికే భారత దేశంలోని చాలా మందికి పర్సనల్ గా చేరాయి అని మనలో ఎంతమందికి తెలుసు? ఆయన ఇలా ప్రతి నెలా ఇలాంటి వాటిపై ఫోకస్ పెడుతూ ప్రజల్లో ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ని నిర్మించుకున్నారు. 

ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలంటి ఇమేజ్ నే నిర్మించుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఆయన ఢిల్లీ పుత్రుడిగా తనని తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేటి ఉదయం అతని ప్రమాణస్వీకారోత్సవంలో కూడా ఆయన సామాన్యప్రజలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాడు. 

ఢిల్లీని తాను నడపట్లేదని సామాన్య ప్రజలు నడుపుతున్నారని అన్నాడు. ఆ సామాన్య ప్రజలను పరిచయం చేస్తూ కూడా చాలా సంతోషం గా ఉందని చెబుతూనే... తాను కూడా అందరిలో ఒక్కడినని గట్టిగ నొక్కి చెప్పాడు. 

సో, కేజ్రీవాల్ జాతీయ రాజకీయాలవైపుగా దృష్టి సారించాడు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన ప్రస్తుతానికి ఒక పర్సనల్ రేలషన్ ని ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. 

click me!