మోడీ దక్షిణ సినీ తారలను మరిచిపోయారని రామ్ చరణ్ భార్య ఉపాసన విమర్శిస్తే, ఖుష్బూ వంత పాడారు. దిల్ రాజు మాత్రం మోడీ భేటీలో ఉన్నారు. దాని పరమార్థమేమిటి?
మహాత్మా గాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోడీ చేంజ్ వితిన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమలోని స్టార్లను పిలిచిన విషయం మనకు తెలిసిందే. ఈ ఈవెంటుకు బాలీవుడ్ స్టార్లు అమీర్ ఖాన్, షారుఖ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కంగనా రనౌత్ లాంటి వారు సందడి చేశారు. ఎందరో దర్శకులు నిర్మాతలు కూడా వచ్చారు. బాలీవుడ్ సెలెబ్రిటీలతోని హౌస్ ఫుల్ గా కనపడింది.
ఈ అంశం సౌత్ సినీ ప్రముఖుల్ని, అభిమానులని నిరాశకు గురిచేసింది. అందరికంటే ముందుగా ఈ విషయంలో రాంచరణ్ సతీమణి ఉపాసన సూటిగా ప్రధాని మోడీని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమతో మోడీ నిర్వహించిన సమావేశానికి దక్షణాది ప్రముఖుల్ని ఆహ్వానించకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
undefined
#also read
మోడీపై రాంచరణ్ భార్య ఉపాసన సంచలన వ్యాఖ్యలు.. మీకు మేం కనిపించలేదా!
భారత చిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ లో కూడా సినీ రంగం ఉందని ఉపాసన మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఉపాసనతో సీనియర్ నటి ఖుష్బూ గొంతు కలిపారు. వరుస ట్వీట్స్ తో మోడీపై ఆమె విరుచుకుపడ్డారు.
ఇలా దక్షిణాది నుండి ఎవరూ లేరు అనుకుంటున్నా తరుణంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు మోడీ తో పాటు ఈ కార్యక్రమంలో ఉన్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. తొలుత మార్ఫింగ్ అని అందరూ భావించారు. కాకపోతే ప్రధాని కార్యాలయం అధికారికంగా విడుదల చేసిన ఫొటోల్లోనూ దిల్ రాజు దర్శనమిచ్చాడు. ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రధానితోని కరచాలనం చేస్తున్న ఫోటోను ట్వీట్ చేస్తూ ప్రధానిని కలవడం గొప్ప అనుభూతని పేర్కొన్నారు.
It was such an honour to meet honourable Prime Minister garu at the event where we celebrated 150 years of Mahatma Gandhi! We discussed the potential the film industry has to make a difference! - Raju pic.twitter.com/VHkUyY0c5g
— Dil Raju Productions (@DilRajuProdctns)సౌత్ నుంచి ఎవ్వరినీ పిలవలేదని ఉపాసన నుంచి ఖుష్బూ వరకు గగ్గోలు పెడుతుంటే, దిల్ రాజు ఒక్కడికి మాత్రమే ఆ ఛాన్స్ ఎలా దక్కింది? ఇది ఇప్పుడు టాలీవుడ్ ను వేధిస్తున్న ఒక మిలియన్ డాలర్ ప్రశ్న.
దక్షిణాది మొత్తానికి దిల్ రాజు ఒక్కడే ఎమన్నా బ్రాండ్ అంబాసిడరా చెప్పండి? ఒకవేళ అలా పిలవాలంటే మొన్ననే దేశభక్తి చిత్రం సైరా హీరో మెగాస్టార్ చిరంజీవినో, బాగా సన్నిహితుడన్నపేరున్న మోహన్ బాబునో, రజనీకాంత్ నో, మోహన్ లాల్ నో, ఇలా చాల మంది ప్రముఖులున్నారు. కానీ ఎవ్వరినీ కాదని దిల్ రాజునూ సౌత్ మొత్తానికి రెప్రజెంటేటివ్ గా పిలిచారనుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది.
మరి ఏ కోటాలో పిలిచినట్టు? కొన్నిరోజుల కింద దిల్ రాజు వరుసగా తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేయబోతున్నానని తెలిపాడు. తాజాగా జెర్సీ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలవనుంది. దీనికి ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించబోతున్న విషయం మనకు తెలిసిందే.
సో, దిల్ రాజు ని పిలిచింది బాలీవుడ్ కోటా నుంచే తప్ప దక్షణాది నుండి కాదన్నమాట.
#also read
ఉపాసనతో గొంతుకలిపిన నటి.. మోడీపై విరుచుకుపడ్డ ఖుష్బూ!
దక్షిణాదిలో కూడా ఎందరో గొప్ప నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. ఇండియాలో సూపర్ స్టార్స్ గా, అత్యుత్తమ టెక్నీషియన్లుగా పేరు ప్రఖ్యాతలు పొందినది దక్షిణాదివారే. కానీ ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమానికి సౌత్ లో ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు.. దీనికిగల కారణాన్ని ప్రధాని తెలియజేయాలి. దక్షణాది వారిని కూడా గౌరవించండి.. దీని గురించి మీరు ఆలోచించాలి" అని ఖుష్బూ డిమాండ్ చేయడం పూర్తిగా సబబే!