రెండు రోజులకింద తెలంగాణాలో భారీ స్థాయిలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపుగా 65 మందిని బదిలీ చేసారు. మామూలుగా బదిలీలు జరగడం సహజం. కానీ ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం కేటీఆర్ కోసమే జరిగాయా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.
తెలంగాణాలో ఎప్పటినుంచో కూడా కేటీఆర్ కి తెలంగాణ ప్రభుత్వ పగ్గాలను అప్పగిస్తారు అనే ఒక విషయమై ఊహాగానాలు వినపడుతూనే ఉన్నాయి. కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరు అనే అంశంపై చర్చ దాదాపుగా సమసిపోయింది. కెసిఆర్ వారసుడు కేటీఆర్ అనేది నిర్వివాద అంశం.
దానితో కేటీఆర్ కి పగ్గాలను అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. రెండవ పర్యాయం తెరాస అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేయడంతో మొదలైన ఈ స్పెక్యులేషన్ ఇప్పుడు తార స్థాయికి చేరింది. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు ఆ విషయం అవగతమవుతుంది.
undefined
ఒక రెండు రోజులకింద తెలంగాణాలో భారీ స్థాయిలో సివిల్ సర్వీసెస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపుగా 65 మందిని బదిలీ చేసారు. మామూలుగా బదిలీలు జరగడం సహజం. కానీ ఇంత భారీ స్థాయిలో బదిలీలు జరగడం కేటీఆర్ కోసమే జరిగాయా అనే అనుమానం మాత్రం కలుగక మానదు.
ఇక కేరళ అధికారి లక్ష్మణ్ నాయక్, ఇప్పుడు కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ శాఖను చేపడతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. లక్ష్మణ్ నాయక్ ఇలా చేపడతారని ప్రచారం కూడా కేటీఆర్ పగ్గాలను చేపట్టబోతున్నారనడానికి ఊతమిచ్చేవిలా కనబడుతున్నాయి. ఒకవేళ కేటీఆర్ పగ్గాలను చేపడితే ఆయనపైన అదనపు భారాన్ని తగ్గించేందుకు ఈ నియామకం దోహదపడుతుంది.
Also read: కేటీఆర్ చుట్టూ గులాబీ రాజకీయాలు
ఇక మునిసిపల్ ఎన్నికల తరువాత కేటీఆర్ చేతికి పగ్గాలను అప్పగిస్తారనే ప్రచారం ఎప్పటినుండో సాగుతూనే ఉంది. మునిసిపల్ ఎన్నికల్లో తెరాస విజయ ఢంకా మోగించిన విష్యం అందరికి తెలిసిందే. మునిసిపల్ ఎన్నికలను పూర్తిగా కేటీఆర్ తన భుజస్కంధాలపై మోసిన విషయం జగమెరిగిన సత్యం.
ఇక మునిసిపల్ ఎన్నికల ఫలితాల ముందు కేటీఆర్ దావోస్ వెళ్లి అక్కడ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎందుకు అనుకూలమో పూర్తి స్థాయిలో వివరించడం, అక్కడ అనేక కంపెనీల ప్రతినిధులతో భేటీ అవడం ఇతరాత్రాలు కేటీఆర్ మైలేజీని అమాంతం పెంచేసాయి.
ఇక ఈ విషయాలతో పాటు మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత కెసిఆర్ పెట్టిన ప్రెస్ మీట్ లోని ఆంతర్యం ఏదైనా ఉందంటే అది కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేయడమే అని బయటకు కనిపించినప్పటికీ.... వాస్తవానికి అందులోని నిగూఢమైన అంశం మాత్రం వేరేదిగా ఉంది.
ఆయన పదే పదే పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకించడంతోపాటుగా ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పాడు. దీనర్థం మరోమారు ఆయన కేంద్ర రాజకీయాలపై కన్నేశారని అర్థం.
2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా కెసిఆర్ కేంద్ర రాజకీయాలపై మక్కువ చూపెట్టిన విషయం తెలిసిందే. తాను కేంద్ర రాజకీయాల్లోకి పూకుదద అంటూ అప్పట్లో రిపోర్టర్లనే ఎదురు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
కెసిఆర్ ఇప్పుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగించాడనికి అనువైన సమయంగా కూడా భవిస్తూ ఉండవచ్చు. కెసిఆర్ ఆరోగ్యంగా, రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నప్పుడే గనుక తన వారసుడని ప్రకటిస్తే తరువాత పార్టీలో అంతర్గత కలహాలను రాకుండా చోడొచ్చని కెసిఆర్ భావిస్తూ ఉండొచ్చు.
Also read: మరో మెట్టు పైకి: తెలంగాణ డిప్యూటీ సీఎంగా కేటీఆర్?
తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధినేత కరుణానిధి సైతం తాను బ్రతికున్నప్పుడే తన వారసుడిగా స్టాలిన్ ను ప్రకటించాడు. అలా ప్రకటించడం వల్ల పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూడగలిగారు. మహారాష్ట్రలో బాల్ ఠాక్రే కూడా అదే విధంగా తన తదుపరి వారసుడిగా ఉద్ధవ్ ఠాక్రే ను ప్రకటించేశాడు.
ఇలా కేసీఆర్ క్రియాశీలకంగా ఉన్నప్పుడే గనుక కేటీఆర్ కి పగ్గాలను అప్పగిస్తే.... ఒకవేళ పార్టీలో ఏమైనా తిరుగుబాటు లాంటి పరిస్థితి ఎదురైనా కెసిఆర్ చూసుకోగలనని భావించి ఉండవచ్చు. ఇప్పటికిప్పుడు కెసిఆర్ ని ఎదురించగల దమ్ము తెరాస లో ఏ ఒక్క నాయకుడికి లేదు అనేది బహిరంగ రహస్యం.
మొన్న మునిసిపల్ ఎన్నికల తరువాత కెసిఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తాను దుక్క లాగ ఉన్నానని, తాను ఇంకొంత కాలం కొనసాగుతానని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తుంటే కెసిఆర్ మరికొంత కాలంపాటు ముఖ్యంన్త్రిగా కొనసాగుతారు అనే విషయం అర్థమవుతుంది. కేంద్రంలో పరిస్థితులు అనుకూలించే వరకు ఆయన వేచి చూసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ అన్ని విషయాలను పరిశీలించి చూసిన మీదట కేటీఆర్ కి పగ్గాలను అప్పగించడమనే విషయంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. ఆయనకు ఎప్పుడు అప్పగిస్తారనే విషయానికి సమాధానం దొరక్క జుట్టు పీక్కుంటున్నారు.
కేటీఆర్ ని కొద్దికాలం తరువాతయినా సీఎం ని చేస్తారు. కానీ ప్రస్తుత తరుణంలో పాలనపై మరింత పట్టు వచ్చేందుకు ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దానికి తోడు ఇప్పుడు తెలంగాణకు గత దఫాలో మాదిరి ఉప ముఖ్యమంత్రి కూడా లేడు. ఏమో దానిని కేటీఆర్ కోసమే రిజర్వు చేశారేమో!!!