సచిన్ బాటలోనే ధోని.... రిటైర్మెంట్ పై వచ్చేసిన క్లారిటీ!

By telugu teamFirst Published Feb 17, 2020, 12:10 PM IST
Highlights

2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత ఎం.ఎస్‌ ధోని మైదానంలో కనిపించలేదు. 2019, జులై 9 తర్వాత టీమ్‌ ఇండియాలో మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యంపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. 

క్రికెట్ అభిమానుల్లో ఏదన్నా ఒక అంతుచిక్కని ప్రశ్న మెదులుతుందంటే అది ఖచ్చితంగా ధోని భవితవ్యం గురించే. అభిమానుల్లోనే కాదు క్రికెట్ పండితులు కూడా ఈ విషయమై తలలు బాదుకుంటున్నారు. జట్టు మానేజ్మెంట్ ఏమో ధోనికి ఎప్పుడు ఎం చేయాలో తెలుసు అని అంటూ నానుస్తున్నారు. 

ఇక సోషల్ మీడియాలోనయితే ఫాన్స్, అంటి ఫాన్స్ మధ్య చిన్నసైజ్ యుద్ధమే నడుస్తుంది. ఒక వర్గమేమో ధోని వయసయిపోయిందని, పస తగ్గిందని వాదిస్తుంటే.... మరికొందరేమో ధోని లాంటి ఫినిషర్ దొరికాక మాట్లాడండి అని అంటున్నారు. 

2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ తర్వాత ఎం.ఎస్‌ ధోని మైదానంలో కనిపించలేదు. 2019, జులై 9 తర్వాత టీమ్‌ ఇండియాలో మహేంద్రసింగ్‌ ధోని భవితవ్యంపై నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. 

జాతీయ జట్టు తరఫున మహి కెరీర్‌పై అనుమానాలు నెలకొన్నా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ధోని కచ్చితంగా మరో రెండు సీజన్లు ఆడతాడనే నమ్మకం అభిమానుల్లో కనిపించింది. దీనిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. 

Also read: యువరాజ్, ధోని స్థానాలకు రీప్లేస్మెంట్ దొరికేశారోచ్!

ఇంత జరుగుతున్న ధోని మాత్రం నోరు మెదపడం లేదు. అప్పట్లో జనవరిలో స్పందిస్తానని అన్నాడు. కానీ స్పందించలేదు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కెరీర్ గురించి ఆలోచించుకోవడానికి ధోని ఈ బ్రేక్ తీసుకున్నాడనేది అందరికి తెలిసిన విషయమే. 

అయితే ధోని మాత్రం సాధారణ మనుషుల్లా రిటైర్మెంట్ తీసుకోవాలా వద్ద అని కాకుండా ఎలా టీం ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనే కసితో ఉన్నట్టు అర్థమవుతుంది. ధోని వయసుపైబడుతున్న వేళ గ్రాండ్ ఎంట్రీ ఏమిటి అనే అనుమానం రావొచ్చు. 

ధోనికి వయసుపైబడుతోందనే విషయం ధోనికి కూడా తెలుసు. అతను ఎంట్రీ ఎంత గ్రాండ్ గా ఇవాలనుకుంటున్నాడో... ఎగ్జిట్ కూడా అంతే గ్రాండ్ గా ఉండాలని కోరుకుంటున్నాడు. కావాలనుకుంటే ధోని రిటైర్ అవుతాను అనుకుంటే...బీసీసీఐ ఒక వీడ్కోలు మ్యాచ్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. 

కానీ ధోని అలా రిటైర్ అవ్వాలనుకోవడం లేదు. గ్రాండ్ గా సచిన్ టెండూల్కర్ లా రిటైర్ అవ్వాలని ధోని భావిస్తున్నాడా అనే విషయాన్నీ కాస్త లోతుగా ధోని గురించి తెలిసిన ఎవరికైనా అర్థమయిపోతుంది. 

టెండూల్కర్ 2011 ప్రపంచ కప్ విజయం తరువాత ఘనంగా క్రికెట్ కి వీడుకోలు పలికాడు. సచిన్ వంటి దిగ్గజ ఆటగాడికి అది ఖచ్చితంగా దక్కాల్సిన సెండ్ ఆఫ్. ఇదే తరహాలో ధోని కూడా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికాడు. 

ఇక పరిమిత వర్ల క్రికెట్ కి కూడా వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైనట్టుగానే ధోని కూడా భావిస్తున్నాడు. టెండూల్కర్ కూడా 38 సంవత్సరాల వయసులోనే కదా. ఇంకా మాట్లాడితే టెండూల్కర్ 39వ పదిలోకి అడుగిడే ఒక 20 రోజుల ముందు మాత్రమే. 

Also read; ధోనీ అవసరం చాలా ఉంది, కానీ అదంతా కోహ్లీ చేతిలోనే.. సురేష్ రైనా

కాబట్టి ఇప్పుడు ధోని సైతం అలంటి వీడ్కోలుకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసం 2020 టి 20 ప్రపంచ కప్ ని వేదికగా ఎంచుకొని అందుకు తగ్గ సన్నాహాలను ప్రారంభించే యోచనలో ధోని ఉన్నట్టుగా కనబడుతుంది. 

2020 వరల్డ్‌కప్‌పై కన్నేసిన ధోని.. 2020 ఐపీఎల్‌ సన్నాహాకాన్ని మార్చి 1 నుంచి మొదలు పెట్టను న్నట్టు సమాచారం. సుమారు ఆరు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోని కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. 

బిజీ కెరీర్‌లో ధోని తొలిసారి సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. ఇటీవలే జార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి నెట్స్‌లో మెరిసిన ధోని మార్చి 1న చెన్నైకి చేరుకోను న్నాడు. ఈ సమాచారాన్ని సీఎస్‌కే వర్గాలు కూడా ధ్రువీకరించాయి. 

ధోని మార్చి 1న చెన్నైకి రానున్నాడని,. రెండు వారాల పాటు ధోని ప్రాక్టీస్‌ చేయనున్నాడని వారు తెలిపారు. ఐపీఎల్ లో ధోని తన పూర్వపు ఫామ్ ను దొరకబుచ్చుకునే ప్రయత్నం చేసేలానే కనబడుతున్నాడు. 

2020 ప్రపంచ కప్ ముందు అత్యున్నతమైన పెర్ఫార్మన్స్ ని గనుక చూపెట్టి, తనలోని మునుపటి ఫినిషర్ ని గనుక బయటకు తీసుకురాగలిగితే..... తిరిగి టీం ఇండియాలోకి ధోని ఎంట్రీ గ్యారంటీ!

click me!