ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్

By telugu teamFirst Published Feb 11, 2020, 12:08 PM IST
Highlights

కేజ్రీవాల్ సంక్షేమ పథకాల నుంచి మొదలు ప్రచార కార్యక్రమాల వార్ఫకు ఆప్ ని గెలిపించిన అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా మనకు ఒక ముఖ్య కారణం కనబడుతుంది. బీజేపీ తీసుకువచ్చిన ఒక ఒరవడే ఇక్కడ ఢిల్లీలో అదే భారతీయ జనతా పార్టీకి శరాఘాతంగా పరిణమించింది.

న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకుపోతుంది. 70 సీట్ల అసెంబ్లీలో ఆప్ ఖచ్చితంగా 50 సీట్లు గెలుచుకోవడం తథ్యంగా కనబడుతుంది. 55-60 సీట్లను ఆప్ కౌంటింగ్ ముగిసేవరకు గెలిచేలా కనబడుతుంది. 

గత దఫాలో ఆమ్ ఆద్మీ పార్టీ 70 సీట్లలో 67 సీట్లను గెలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో కూడా అంతటి భారీ స్థాయిలో విజయం సాధించకున్నప్పటికీ కూడా.... ఖచ్చితంగా భారీ విజయాన్నే సాధించేట్టుగా కనబడుతుంది. 

ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతటి రికార్డును సాధించే దిశగా దూసుకుపోతుండడంతో... అసలు ఇంతటి భారీ విజయాన్ని కేజ్రీవాల్ ఎలా సాధించాయగలిగాదని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

Also read; అరవింద్ కేజ్రీవాల్ గెలుపు... ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇదే!

అందుకు కేజ్రీవాల్ సంక్షేమ పథకాల నుంచి మొదలు ప్రచార కార్యక్రమాల వార్ఫకు ఆప్ ని గెలిపించిన అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా మనకు ఒక ముఖ్య కారణం కనబడుతుంది. బీజేపీ తీసుకువచ్చిన ఒక ఒరవడే ఇక్కడ ఢిల్లీలో అదే భారతీయ జనతా పార్టీకి శరాఘాతంగా పరిణమించింది. 

2014 పార్లమెంటు ఎన్నికల్లో మోడీ ఒక బలమైన నాయకుదిగా ఎన్నికల బరిలో నిలిచాడు. 2019 పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మోడీ మరింత బలమైన నేతగా... మోడీ కాకపోతే ఇంకెవరు అని ప్రశ్నించారు.

ఆ మోడీ ప్రశ్నకు ప్రతిపక్షాల వద్ద సరైన సమాధానం కూడా లేదు. మోడీ కాకపోతే ఇంకెవారు అనే ప్రశ్నకు ప్రతిపక్షం కూడా సమాధానం చెప్పలేకపోవడంతో ... ప్రజలందరికీ కూడా మోడీ ఒక్కడు మాత్రమే బలమైన నేతగా కనిపించదు. 

ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే వాతావరణం మనకు కనబడుతుంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక బలమైన నేత. ఆయన ఇప్పుడు అక్కడ మిగిలిన పార్టీల నేతలకు కూడా ఒక బలమైన సవాల్ ని విసిరాడు. 

ఆయన అక్కడ నేను కాకపోతే ఎవరు అనే ప్రశ్నను లేవనెత్తాడు. ఎన్నిక ఢిల్లీది మాత్రమే అనే విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. మిగిలిన ప్రతిపక్షాలకు కేజ్రీవాల్మ్ విసిరినా ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. 

Also read: ఢిల్లీ ఫలితాలు 2020: ఉల్లి దెబ్బకు నాడు బీజేపీ విలవిల, నేడు ఆప్‌ ఎస్కేప్

షీలా దీక్షిత్ మరణంతో ఢిల్లీ కాంగ్రెస్ తన పెద్ద దిక్కును కోల్[పోయింది. బీజేపీ సైతం సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీల మరణంతో అక్కడ బలమైన నేతలను కోల్పోయింది. ఇలా ఇరు పార్టీలు కూడా తమ బలమైన నాయకులను కోల్పోవడంతో వారికి దిక్కు లేకుండా పోయింది. 

బీజేపీ తరుఫున మనోజ్ తివారి, గౌతమ్ గంభీర్ వంటి పాపులర్ లీడర్స్ ఉన్నప్పటికీ వారు అరవింద్ కేజ్రీవాల్ స్థాయికి సరితూగే నాయకులు కాదు. కాంగ్రెస్ కి కనీసం ఆ స్థాయిలో నాయకులు కూడా దిక్కులేరు. 

కాంగ్రెస్ నాయకులు గతంలో గెలిచినవారే అయినప్పటికీ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా పాపులర్ లీడర్స్ కాదు. ఉదాహరణకు అరవిందర్ సింగ్ లవ్లీ బలమైన నేత అయినప్పటికీ... ఢిల్లీ మొత్తాన్ని నడిపించేంత స్థాయి ఉన్న నేత ఆయన ఎంత మాత్రము కాదు. 

ఇలా బీజేపీ మోడీని బలమైన నేతగా చూపెడుతూ... ఎన్నికలను ప్రెసిడెన్షియలైజ్ చేస్తూ తీసుకొచ్చిన ఒక ఒరవడి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీనే దెబ్బతీసింది అని మాత్రం చెప్పక తప్పదు. 

click me!