Ayodhya Verdict: కాశ్మీర్ టు అయోధ్య వయా కర్తార్ పూర్

By telugu team  |  First Published Nov 9, 2019, 4:36 PM IST

కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న కొన్ని సమస్యలకు నేడు పరిష్కారం లభించింది. ఈ రెండు సమస్యల పరిష్కారంలోనూ మెరిసింది ఎవరంటే అది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీయే!


పుల్వామా, బాలకోట్, కాశ్మీర్ సంక్షోభం ఉన్నప్పటికీ, రెండు పంజాబ్‌ల మధ్య ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా కారిడార్ తెరుచుకుంటుందని ఆశ మాత్రం సజీవంగా ఉంది. ఆశకు ప్రాణం పోస్తూ దాని నిర్మాణం పూర్తయ్యింది. కర్తార్ పూర్ కారిడార్ ని నేడు ప్రధాని ప్రారంభించారు. 

పుల్వామా దాడి తరువాత పాకిస్తాన్‌తో చర్చలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారాలు మూసేసారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 రద్దు విషయమై  ఐరాస జనరల్ అసెంబ్లీ మీటింగ్ లో సహా  పలు సందర్భాల్లో అనేక వేదికలపై ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య  మట్టల యుద్ధాలు చాలానే జరిగాయి. భారత హైకమిషనర్ అజయ్ బిసరియాను ఏకంగా పాకిస్తాన్ బహిష్కరించింది.

Latest Videos

undefined

Also read: అయోధ్యపై సుప్రీం తీర్పు... అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి

కానీ, మొదటి సిక్కు గురువు గురు నానక్ మందిరం వద్ద ప్రార్థనలు జరుపుకోవడానికి మాత్రం  పాకిస్తాన్ సరిహద్దులను ఒకింత చెరిపివేసినట్టుగా చెప్పుకోవచ్చు. 

ఈ వారంలో  వాస్తవానికి, చరిత్రలో ముఖ్యమైన రెండు సమస్యలకు  శాశ్వత పరిష్కారం లభించాయి. ఈ రెండింటిలోనూ, సూపర్ హీరో ఎవరంటే మాత్రం అది ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీయే! కర్తార్ పూర్ లోని సిక్కులైనా, అయోధ్యలో హిందువులైనా - రిలీజియస్ సెంటిమెంట్లకుండే పవర్ ని మోడీ కరెక్ట్ గా అంచనావేశారని చెప్పవచ్చు. 

మొదటి ఎడతెగని సమస్యైన కర్తార్‌పూర్ సాహిబ్ విషయానికి వస్తే, ఈ ప్రయాణం ద్వారా రెండు పంజాబ్‌ల మధ్య దూరాన్ని చెరిపివేయడంలో  ఒక చిన్న ముందడుగు పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 

రెండవది సరయు నది ఒడ్డున ఉన్న రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఈ తీర్పును అందరూ వినయంతో అంగీకరించాలని ప్రధాని ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టేటువంటి, శాంతికి విఘాతం కలిగించే  ఏ విధమైన వ్యాఖ్యలూ చేయవద్దని తమ పార్టీ నేతలకు ఇప్పటికే హితవు పలికారు ప్రధాని. 

కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్...

కర్తార్‌పూర్ సాహిబ్‌పై సిక్కుల బలమైన మనోభావాలను మోడీ బాగానే గ్రహించారు. గత వారం బ్యాంకాక్‌లో, ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో భారతీయ-థాయ్ సమాజంతో (వీరిలో పెద్ద సంఖ్యలో నామ్‌ధారి సిక్కులు ఉన్నారు) మాట్లాడిన ప్రధాని వారిని భారతదేశానికి వచ్చి కర్తార్‌పూర్ కారిడార్ మీదుగా ప్రయాణించాలని ఆహ్వానించారు.

Also read: బాబ్రీ మసీదు కూల్చివేత సరికాదు.. సుప్రీం కోర్టు

తొలుత ఈ ప్రాజెక్టు పట్ల ఒకింత ఆలోచనలో పడ్డప్పటికీ చివరకు ఈ ప్రాజెక్టు హీరోగా మోడీ అవతరించారు. మోడీ ఇలా ఆలోచన చేయడానికి కారణం కూడా లేకపోలేదు. కొన్ని రాజకీయమైనవి - ముఖ్యంగా పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నేత. కానీ ఈ సెంటిమెంటల్ విషయం వల్ల సిక్కుల్లో బీజేపీ పట్ల సానుభూతి పెరగడంతోపాటు, తమ మిత్రపక్షమైన అకాలీదళ్ కి కూడా కొంత మైలేజ్ వస్తుందని, అది ఓట్ల రూపంలో మారుతుందని మోడీ త్వరగానే గ్రహించారు. 

కర్తార్ పూర్ కారిడార్ కేవలం ఒక స్వల్పకాలిక రాజకీయ అంశం కాదు. ఇది నిజంగా ఒక చారిత్రాత్మక క్షణం అని మోడీ గ్రహించారు. 1947 లో భారత విభజన తరువాత రెండు పంజాబ్‌ల మధ్య వాగా-అట్టారి వద్ద  కాకుండా వేరే చోట ఇలా సరిహద్దును దాటడం ఇదే తొలిసారి(యుద్ధ సమయంలో కాకుండా శాంతి కాలంలో వేరే ఏ చోటా ఎవరూ సరిహద్దు దాటలేదు) 

భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి గ్రామమైన డేరా బాబా నానక్ వెళ్లే మార్గంలో, చారిత్రాత్మక బెర్ సాహిబ్ గురుద్వారాను శనివారం మోడీ సందర్శించారు.  ఇక్కడ, యాత్రికుల కోసం ఒక ప్రయాణీకుల టెర్మినల్ నిర్మించబడింది, దీనిని ఆయన ప్రారంభించారు.

Also read: ayodhya verdict: తుది తీర్పు వెలువరించిన జడ్జిల నేపధ్యం ఇదే

కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వర రావి నదికి అవతల పాకిస్తాన్ వైపున ఉంది.  కేవలం భారత సరిహద్దు నుండి 4కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గాలి బాగ్ వీచే రోజున సాయంకాలం పూట  ‘గుర్బానీ’ కూడా వినపడుతుంది.

పాకిస్తాన్ "హైబ్రిడ్" ప్రభుత్వంతో మోడీ చాలా త్వరగానే ఒక ఒప్పందానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. పాకిస్తాన్ నిజమైన శక్తి ఆర్మీతో ఉందని,  ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కేవలం సైన్యం ముసుగు అనే విషయాన్నీ కరెక్ట్ గా చాలా త్వరగా గ్రహించారు. 

అయోధ్య తీర్పు...

అయోధ్య విషయానికొస్తే, రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంలో తీర్పు వెలువడినప్పుడు చరిత్రను పునరావృతం చేయడానికి తాను అనుమతించబోనని మోడీ ఇప్పటికే ప్రకటించాడు. అందుకు సంబంధించి దేశ ప్రజలకు సంయమనం పాటించాలని వరుస ట్వీట్లతో అభ్యర్థించాడు. తన మంత్రివర్గంలోని మంత్రులను కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని మోడీ ఇప్పటికే ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. 

ప్రధానమంత్రిగా, ప్రపంచ నాయకుడిగా మోడీ ప్రతిష్ట ఈ తీర్పు తదనంతర పరిణామాలపై ఆధారపడి ఉంది. తీర్పు తరువాత పరిస్థితులు సాధారణంగా, జనజీవనం సాఫీగా సాగితే మోడీ పేరు మరో మారు ప్రపంచపటంపై మార్మోగిపోతోంది. గతంలో బాబ్రీ మసీద్ కూల్చివేత అనంతరం జరిగిన అల్లర్లలో దాదాపుగా 2,000 మంది ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ సారి ఆ తప్పును మోడీ జరగనీయదల్చుకోలేదు. 

Also read: Ayodhya Verdict: వివాదం 70 ఏళ్ల వివాదం, వరుస ఘటనలు ఇవీ....

అందుకే ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, ముస్లిం సంస్థలతో పాటు పౌర సమాజానికి కూడా మోడీ ఈ విషయమై మోడీ అభ్యర్థన చేసాడు. మోడీ అభ్యర్థనను దాదాపుగా అన్ని సంఘాలు సంస్థలు ఒప్పుకున్నట్టుగా మనకు కనపడుతుంది. తీర్పు పట్ల ఒకింత అసంతృప్తిగా ఉన్నామన్నప్పటికీ, వారు కూడా సుప్రీమ్ తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఏమైనా చేయదల్చుకుంటే రివ్యూ పిటిషన్ వేద్దామే తప్ప అందరూ శాంతితో సంయమనంతో మెలగాలని పిలుపునిచ్చారు. 

ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే మోడీ మాత్రం రెండు అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు స్వయంగా వాటికి శాంతియుత పరిష్కారం చూపెట్టడానడంలో నో డౌట్. కొన్ని నెలల కిందనే జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి కాశ్మీర్, భారతదేశ అంతర్గత అంశమని ప్రపంచానికి చాటిన మోడీ ఇప్పుడు మరోమారు తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించారు. 

click me!