దొంగతనానికి వచ్చి... ముద్దులు పెట్టి వెళ్లాడు..

Published : Oct 19, 2019, 07:36 AM ISTUpdated : Oct 19, 2019, 11:19 AM IST
దొంగతనానికి వచ్చి... ముద్దులు పెట్టి వెళ్లాడు..

సారాంశం

హెల్మెట్లు ధరించి, మారణాయుధాలతో ఉన్న ఇద్దరు దుండగులు ఓ ఫార్మసీ స్టోర్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో షాపు యజమాని, ఓ పెద్దావిడ మాత్రమే ఉన్నారు. ఓ దొంగ యజమానిని బెదిరించి డబ్బు తీసుకుంటుండగా, రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకున్న మరో దొంగ పెద్దావిడ వద్ద నిల్చున్నాడు.

దొంగతనానికి వచ్చిన వాళ్లు ఏం  చేస్తారు..? ఎవరూ చూడకుండా ఉన్నదంతా దోచుకుపోవాలని అనుకుంటారు. కానీ... ఓ దొంగ మాత్రం వచ్చి ముద్దులు పెట్టి వెళ్లిపోయాడు. ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. మారణాయుధాలతో లోపలికి వెళ్లి మరీ... ముద్దు పెట్టి వచ్చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

బ్రెజిల్ లో ఓ దొంగ.. దొంగతనానికి వెళ్లాడు. హెల్మెట్లు ధరించి, మారణాయుధాలతో ఉన్న ఇద్దరు దుండగులు ఓ ఫార్మసీ స్టోర్‌లోకి ప్రవేశించారు. ఆ సమయంలో షాపు యజమాని, ఓ పెద్దావిడ మాత్రమే ఉన్నారు. ఓ దొంగ యజమానిని బెదిరించి డబ్బు తీసుకుంటుండగా, రెండు చేతుల్లో రెండు తుపాకులు పట్టుకున్న మరో దొంగ పెద్దావిడ వద్ద నిల్చున్నాడు.

 దీంతో ఆమె తన వద్ద ఉన్న డబ్బులు తీసుకోవాల్సిందిగా అతడిని కోరింది. అందుకు నిరాకరించిన దొంగ.. ఆమె నుదిటిపై ముద్దుపెట్టాడు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలిపి, భుజం తట్టడం కూడా వీడియోలో రికార్డైంది. మరో దొంగ మాత్రం షాపులోని కొన్ని సామాన్లు, 240 డాలర్లు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ పరారయ్యారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

Overworked: ఆఫీస్‌లో 70 గంటలకు పైగా ఉద్యోగం.. చివరికి విడాకులు కోరిన భార్య.. టెక్కీ మనో వేదన ఇలా!
Sunflowers History: సర్‌ఫ్లవర్ సూర్యడివైపు ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? సైన్స్‌, గ్రీకు కథ ఎం చెబుతుందంటే?