10 అడుగుల కొండ చిలువ.. రైతు మెడకు చుట్టుకొని(వీడియో)

By telugu teamFirst Published Oct 17, 2019, 2:15 PM IST
Highlights

అక్కడ కూలీలతో కలిసి పొలం పనులు చేస్తుండగా... అతనికి 10 అడుగుల పొడవు ఉన్న ఓ కొండ చిలువ కనిపించింది. దీంతో... వెంటనే అతను ఇతర కూలీల సహాయంతో దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ కొండ చిలువ అతని మెడను చుట్టేసింది.
 

అల్లంత దూరంలో ఓ పాము కనిపిస్తే మనం ఏం చేస్తాం. భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తాం. అదే పాము కాస్త దగ్గర వస్తే మరింత కంగారు పడుతాం. ఏకంగా ఆ పాము వచ్చి మెడకు చుట్టేసుకుంటే.... ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. కానీ ఓ వ్యక్తికి నిజంగా ఇదే అనుభవమైంది. పొలం పనులు చేసుకుంటంటే... 10 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువ మెడను చుట్టేసింది. అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతని పని అయిపోయిందని అనుకున్నారు స్థానికులంతా.. కానీ.... ఆ కొండ చిలువ బారి నుంచి అతను భయటపడ్డాడు. కాగా... ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన భువన చంద్రన్ నాయర్(61) అనే వ్యక్తి పొలానికి వెళ్లాడు. అక్కడ కూలీలతో కలిసి పొలం పనులు చేస్తుండగా... అతనికి 10 అడుగుల పొడవు ఉన్న ఓ కొండ చిలువ కనిపించింది. దీంతో... వెంటనే అతను ఇతర కూలీల సహాయంతో దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ కొండ చిలువ అతని మెడను చుట్టేసింది.

అతనికి ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పక్కనే ఉన్న కూలీలు... అతని మెడకు పట్టుకున్న కొండ చిలువను విడిపించే ప్రయత్నం చేశారు. చివరకు అతని మెడను అది వీడింది. ఈ క్రమంలో అతనికి స్పల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. 

Kerala: A man was rescued from a python by locals after the snake constricted itself around his neck in Thiruvananthapuram, today. The snake was later handed over to forest officials and released in the forest. pic.twitter.com/uqWm4B6VOT

— ANI (@ANI)

 

click me!